2022 లో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ 2’ కూడా ఆ లిస్ట్ లో చేరనుంది. ఏప్రిల్ 14న గురువారం నాడు విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్2’ ని తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంది. హీరో యష్ మాస్ పెర్ఫార్మన్స్ అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకి గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందనే చెప్పాలి.
అయితే ‘కె.జి.ఎఫ్'(సిరీస్) కథలో ఇన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ నిండి ఉండడానికి కారణం.. దాని వెనుక ఉన్న మదర్ సెంటిమెంట్ అనే చెప్పాలి. ఈ చిత్రానికి పిల్లర్ లాంటిది తల్లి పాత్ర. ‘తందనే తానే’ అనే ట్యూన్ గుర్తుకొచ్చినా.. ‘తల్లిని మించిన యోధులెవ్వరూ లేరిక్కడ’ అనే డైలాగ్ వినిపించినా టక్కున మనకి ‘కె.జి.ఎఫ్2’ లో తల్లి పాత్రే గుర్తుకొస్తుంది. అలా అని హీరో పెద్దయ్యాక కూడా సినిమాలో తల్లి పాత్ర ఉండదు.
కానీ హీరో పెద్ద రేంజ్ కు వెళ్ళడానికి తల్లి పాత్ర కారణం అవుతుంది. చిన్నప్పుడే తల్లి తన కళ్ళముందు చనిపోవడం చూసి జీవితం మీద కసితో ఎదుగుతాడు హీరో. ఇక ఈ చిత్రంలో హీరో యష్ తల్లి శాంతమ్మ పాత్రని పోషించింది అర్చన జోయిస్ అని ఎక్కువ మందికి తెలిసుండదు. గతంలో ఈమె విజయరథ, నక్షి వంటి కన్నడ చిత్రాల్లో నటించింది. ఈమె వయసు 27 ఏళ్ళు మాత్రమే.నిజజీవితంలో ఈమె కంటే హీరో యష్ వయసులో పెద్దవాడు.
అయితే సినిమాలో ఆ ఇంపాక్ట్ ఉండదు. యంగ్ ఏజ్ లో చనిపోయే అమ్మగా చూపిస్తారు కాబట్టి.. అలా కవర్ అయిపోయింది.ఈమె ఓ క్లాసికల్ డాన్సర్. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో రాణించాలనేది ఆమె బలమైన కోరిక అని తెలుస్తుంది.