Upasana, Ram Charan: ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు : ఉపాసన

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్-ఉపాసనలకు వివాహం జరిగి ఎనిమిదేళ్లవుతున్నా.. ఇప్పటివరకు పిల్లలను ప్లాన్ చేసుకోలేదు. ఆమె ఎక్కడికి వెళ్లినా.. పిల్లలకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది మెగా కోడలు. జూనియర్ రామ్ చరణ్ కానీ, జూనియర్ ఉపాసనను కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చని యాంకర్ అడగ్గా.. అది తన వ్యక్తిగత విషయమని చెప్పింది ఉపాసన. దీని గురించి చాలా మంది అడుగుతూనే ఉన్నారని..

కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని ఉపాసన తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీనికి గురించి తనేం ఆన్సర్ చేసినా.. సెన్సేషన్ అవుతుందని.. అది తనకు ఇష్టం లేదని అంది. తాను చెప్పాలనుకున్నప్పుడే సమాధానం చెప్తానని తేల్చి చెప్పింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలానే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో తనకు నచ్చిన సినిమా ‘రంగస్థలం’ అని.. చిరంజీవి గారు నటించిన ‘సైరా’ నరసింహారెడ్డి’ బాగా నచ్చిందని చెప్పింది.

తనకు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదని.. ఈ విషయంలో తన భర్త రామ్ చరణ్, అత్తయ్య సురేఖా బాగా హెల్ప్ చేస్తుంటారని చెప్పుకొచ్చింది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus