బాలీవుడ్‌లో దీపావళి సందడి మొదలైంది. ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇచ్చిన గ్రాండ్ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ అంతా క్యూ కట్టారు. అయితే, యంగ్ హీరోయిన్లందరినీ పక్కకు నెట్టి, 90s సెన్సేషన్ ఊర్మిళ మటోండ్కర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. 51 ఏళ్ల వయసులోనూ ఆమె గ్లామర్ చూసి అందరూ షాకయ్యారు.మనీష్ మల్హోత్రా ప్రతి ఏటా ఇచ్చే దీపావళి పార్టీకి ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈసారి కూడా రేఖ, కాజోల్ నుంచి కృతి సనన్, అనన్య పాండే వరకు ఎందరో తారలు ఈ ఈవెంట్‌లో మెరిశారు. కానీ, అందరి చూపు మాత్రం ఊర్మిళ పైనే నిలిచింది. స్టైలిష్ డిజైనర్ వేర్‌లో, అదిరిపోయే లుక్‌తో పార్టీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది.ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను ఊర్మిళ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. "51 ఏళ్లలో ఇంత అందం ఎలా సాధ్యం?" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్ సెక్షన్ మొత్తం ఫైర్ ఎమోజీలతో నిండిపోయింది. ఒకప్పుడు తన అందంతో ఇండియన్ సినిమాను ఊపేసిన ఊర్మిళ, ఇప్పటికీ తన గ్రేస్‌తో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోందని ఈ ఫోటోలు ప్రూవ్ చేస్తున్నాయి. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఊర్మిళ మటోండ్కర్..ది ఒక ఐకానిక్ కాంబో. 'రంగీలా'తో ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన వర్మ, ఆ తర్వాత 'గాయం', 'సత్య', 'భూత్', 'కౌన్' వంటి ఎన్నో విభిన్నమైన హిట్ చిత్రాలను అందించారు. వారిద్దరి కలయికలో దాదాపు డజనుకు పైగా సినిమాలు, స్పెషల్ సాంగ్స్ వచ్చాయి. మొత్తానికి ఇన్నేళ్ళ తర్వాత ఊర్మిళ మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది.