Anu Emmanuel: ఆ ఇమేజ్ ను అను ఇమ్మాన్యుయేల్ పోగొట్టుకుంటుందా?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన అను ఇమ్మాన్యుయేల్ అల్లు శిరీష్ కు జోడీగా రాకేశ్ శశి డైరెక్షన్ లో నటించి ఊర్వశివో రాక్షసివో సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. కెరీర్ లో సరైన విజయం లేని అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమా సక్సెస్ తో కొత్త ఆఫర్లను అందుకుంటున్నారు. కార్తీకి జోడీగా నటించే అవకాశాన్ని అను ఇమ్మాన్యుయేల్ సొంతం చేసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సునీల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రముఖ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేయనున్నారు. రాజు మురుగన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు జపాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఊర్వశివో రాక్షసివో సక్సెస్ తో అను ఇమ్మానుయేల్ జాతకం మారిపోయిందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. అను ఇమ్మాన్యుయేల్ ఫ్లాప్ హీరోయిన్ ఇమేజ్ ను పోగొట్టుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జపాన్ సినిమాతో సక్సెస్ సాధిస్తే అను ఇమ్మాన్యుయేల్ కు మరికొన్ని సినిమా ఆఫర్లు వస్తాయని చెప్పవచ్చు.

ఊర్వశివో రాక్షసివో సక్సెస్ తో అను ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని తెలుస్తోంది. రాజు మురుగన్ గత సినిమాలకు అవార్డులు వచ్చాయి. ఈ సినిమా కూడా ఆ సినిమాలను మించి ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అను ఇమ్మాన్యుయేల్ ప్రాజెక్ట్ ల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలకు కూడా అను ఇమ్మాన్యుయేల్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

అను ఇమ్మాన్యుయేల్ వైవిధ్యమైన కథలను ఎంచుకోవాలని ఆ సినిమాలతో కచ్చితంగా సక్సెస్ దక్కేలా జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అను ఇమ్మాన్యుయేల్ పలువురు స్టార్ హీరోలకు జోడీగా నటించినా సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus