త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివల తర్వాత ఒక రైటర్ గా ఆస్థాయి స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తూ దర్శకుడిగా మారిన వక్కంతమ్ వంశీకి “నా పేరు సూర్య” సినిమాతో దర్శకుడిగా ఆ స్థాయి పేరు రాలేదనే చెప్పాలి. కమర్షియల్ గా ఫెయిల్ అవ్వడమే కాక ప్రేక్షకులను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రంతో దర్శకుడిగా వక్కంతమ్ వంశీకి శుభారంభం లభించలేదు. పైగా.. వక్కంతమ్ కథ అందించిన “టచ్ చేసి చూడు” కూడా డిజాస్టర్ గా నిలవడంతో మూడు నెలల గ్యాప్ తో విడుదలైన ఈ రెండు సినిమాలతో వంశీ దర్శకుడిగా-రచయితగా విఫలమయ్యాడు.
దాంతో “నా పేరు సూర్య” అనంతరం దర్శకుడిగా ఎన్టీయార్ లేదా మరో స్టార్ హీరోతో దర్శకుడిగా తన సెకండ్ సినిమా ప్లాన్ చేసుకున్న వంశీ ఆశలను “నా పేరు సూర్య” రిజల్ట్ నీరుగార్చేసింది.అందువల్ల వంశీ మళ్ళీ రచయితగా కొన్నాళ్లపాటు కంటిన్యూ అయ్యి ఆ తర్వాత మంచి కథతో ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని తన సెకండ్ సినిమాకి సిద్ధమవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట. అందుకే అర్జెంట్ గా తన దగ్గరున్న కంప్లీట్ చేయని కథలను పాలిష్ చేయడం మొదలెట్టాడట.