ఇది నిజమైతే వరలక్ష్మీ తెలుగులో స్టార్ అయిపోయినట్టే..!

తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన వరలక్ష్మీ.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కానీ స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.. అయినప్పటికీ ఆ రకంగా ఆమె సక్సెస్ కాలేకపోయింది. ఇక నెగిటివ్ రోల్స్ తో ఆకట్టుకున్నప్పటికీ.. అక్కడ ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. కానీ తెలుగులో మాత్రం ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ‘క్రాక్’ ‘నాంది’ చిత్రాల్లో ఈమె మంచి నటన కనపరిచి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఆ రెండు సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. రవితేజ, అల్లరి నరేష్ లను ప్లాపుల నుండీ బయటపడేసిన సినిమాలు అవి.వీటిలో వరలక్ష్మీ పాత్ర కూడా హైలెట్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు ఈమెకు భారీ ఆఫర్లు దక్కుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుంది. పాన్ ఇండియా లెవెల్లో ఇది రూపొందనుంది. 2022లోనే ఈ చిత్రం రాబోతుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం తాజాగా ఈమెను సంప్రదించారట.

ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి వరలక్ష్మి కూడా సంతోషంగా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ-సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ చిత్రం చేస్తున్నాడు. ఆగష్టు 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. మరోపక్క కొరటాల శివ కూడా మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నాడు.మేలో ఆ చిత్రం విడుదల కాబోతుంది. అటు తరువాత బన్నీ-కొరటాల చిత్రం ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.