Varun Sandesh: అలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదన్న వరుణ్!

  • December 28, 2021 / 11:11 AM IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బా షోపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ప్రేక్షకులు ఈ షో గురించి పాజిటివ్ గా స్పందిస్తే ఎక్కువమంది ప్రేక్షకులు ఈ షో గురించి నెగిటివ్ గా కామెంట్లు చేస్తారు. వరుణ్ సందేశ్, వితికా షేరు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో వితికా షేరు ప్రవర్తన గురించి చాలా సందర్భాల్లో నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ సినిమాల విషయంలో కొందరు గైడెన్స్ ఇచ్చారని అయితే డాడ్ సపోర్ట్ ఎంతో ఉందని ఆయనే నాకు గైడ్ అని వరుణ్ పేర్కొన్నారు. 17 సంవత్సరాల వయస్సులో నా తరపున ఏం జరిగినా నాన్న మోశారని వరుణ్ వెల్లడించారు. ఏం జరిగినా నాకంటే ఎక్కువగా నాన్న ఫీల్ అయ్యారని అలాంటి ఫాదర్ ఉండటం తనకు లక్ అని వరుణ్ చెప్పుకొచ్చారు. వితికా షేరుకు ఫాదర్ లేరని ఆ ఫీలింగ్ ను తాను మాత్రం తలచుకోలేనని వరుణ్ పేర్కొన్నారు.

వితిక కోడలైనా నాన్న కూతురులా చూస్తారని వరుణ్ చెప్పుకొచ్చారు. సినిమా ద్వారా వితికతో ఏర్పడిన పరిచయమే తర్వాత ప్రేమగా మారిందని వరుణ్ వెల్లడించారు. చెల్లి ఇక్కడ మెడిసిన్ చేసిందని వితిక గురించి చెల్లికి తెలుసు కాబట్టి మమ్మీడాడీలకు చెల్లి లీక్ చేసిందని వరుణ్ అన్నారు. వితిక అమెరికాకు వచ్చి అక్కడ నన్ను, పేరెంట్స్ ను సర్ప్రైజ్ చేసిందని వరుణ్ సందేశ్ వెల్లడించారు. తన తల్లిదండ్రులకు కూడా వితిక నచ్చడంతో ఆ తర్వాత సంవత్సరానికి నిశ్చితార్థం, పెళ్లి జరిగాయని వరుణ్ అన్నారు.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఎడిటింగ్ గురించి, కట్ చేసిన సీన్ల గురించి వితిక బాధ పడిందని వరుణ్ చెప్పుకొచ్చారు. వితికకు కొన్ని మెసేజెస్ ఘోరంగా బూతులు తిడుతూ పెట్టారని ఆ మెసేజ్ ల వల్ల వితిక టార్చర్ అనుభవించిందని రియాలిటీ షోలను చూసి క్యారెక్టర్ ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని వరుణ్ తెలిపారు. వితిక విషయంలో తాను చాలా గర్వపడతానని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus