Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ప్రేమకథతో ‘ఫిదా’

ప్రేమకథతో ‘ఫిదా’

  • August 5, 2016 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేమకథతో ‘ఫిదా’

వినూత్నమైన కథలు ఎంచుకుంటూ అతి తక్కువకాలంలో తనకుంటూ ఓ మార్క్‌ తెచ్చుకున్న మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఫిదా’. అటు యువతను, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కథా బలమున్న చిత్రాలను తీసే శేఖర్‌ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ప్రేమమ్‌’ ఫేం సాయిపల్లవి కథానాయికగా తెలుగుతెరకు పరిచయమవుతోంది. శుక్రవారం నిజామాబాద్‌లోని బాన్సువాడలో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌ రాజు, సాయి పల్లవి క్లాప్‌నివ్వగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

అనంతరం దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుడూ ”చక్కని ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆనంద్ , గోదావరి తర్వాత పూర్తిస్థాయి ప్రేమకథతో సినిమా చేయలేదు. ఈ సినిమాకు మంచి యూత్‌ఫుల్‌ కథ కుదిరింది. వరుణ్‌, సాయిపల్లవి జంట చూడముచ్చటగా ఉంది. ఇద్దరూ ప్రతిభగల నటులు. దిల్‌రాజుగారి బ్యానర్‌లో తొలిసారి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది” అని అన్నారు.
నాగబాబు మాట్లాడుతూ ”సినిమా అంటే పాషన్‌ ఉన్న నిర్మాత దిల్‌ రాజు. ఆయనతో సినిమా అంటే ఏ హీరో అయినా ముందుకొస్తాడు. ఫీల్‌గుడ్‌, విలువలున్న సినిమాలు తీయడంతో శేఖర్‌ కమ్ముల స్పెషలిస్ట్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వరుణ్‌కి సినిమా కుదరడం ఆనందంగా ఉంది. టీమ్‌కి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని అన్నారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ ”ఏడాది క్రితం నుంచే శేఖర్‌ ఈ కథ మీద వర్క్‌ చేస్తున్నారు. కథ వినగానే చాలా ఎగ్జైట్‌ అయ్యి ఓకే చెప్పేశా. ‘కంచె’లో వరుణ్‌ నటన చూసి తనలో ఉన్న పొటెన్షియల్‌ అర్ధం చేసుకున్నారు దర్శకుడు. ‘ప్రేమమ్‌’లో సాయిపల్లవి క్యారెక్టర్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరు ఈ కథకు యాప్ట్‌ అవుతారని సెలెక్ట్‌ చేశాం. అమెరికా అబ్బాయికి, తెలంగాణలో పెరిగిన అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథ ఇది. ఈ సినిమా మా బ్యానర్‌లో ఓ సెన్సెషనల్‌ లవ్‌స్టోరీ అవుతుందని నమ్ముతున్నాను. దిల్‌, ఆర్య, కొత్త బంగారులోకం చిత్రాల తర్వాత కొత్త జోనర్‌ సినిమాలు తీసి విజయం సాధించాను. మరోసారి ఫ్రెష్‌ లవ్‌స్టోరితో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాం. శుకవ్రారం ప్రారంభమైన ఈ చిత్రం 40 రోజులపాటు బాన్సువాడలో చిత్రీకరణ జరుపుకుని తర్వాత షెడ్యూల్‌ను అమెరికాలో చేస్తాం” అని చెప్పారు.

సాయిపల్లవి మాట్లాడుతూ ”తెలుగులో నా తొలి సినిమా ఇది. విజనరీ టీమ్‌తో పనిచేయడం, నా మొదటి సినిమా దిల్‌ రాజుగారి బ్యానర్‌లో కుదరడం ఆనందంగా ఉంది. వరుణ్‌ మంచి కోస్టార్‌” అని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌కుమార్‌, సంగీతం: శక్తికాంత్‌, ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Fida Movie
  • #Sai Pallavi
  • #Sekhar Kammula
  • #Varun Tej

Also Read

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

HariHara Veeramallu Collections: మొదటి సోమవారం 4 రెట్లు పడిపోయింది

related news

Paruchuri Review: అలా అయితే.. ‘కుబేర’కు మరో ₹50 కోట్లు వచ్చేవి.. పరుచూరి లాస్ట్‌ రివ్యూ

Paruchuri Review: అలా అయితే.. ‘కుబేర’కు మరో ₹50 కోట్లు వచ్చేవి.. పరుచూరి లాస్ట్‌ రివ్యూ

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Nithiin: నితిన్ కి దిల్ రాజు ప్రపోజల్.. మళ్ళీ త్యాగం చేయాల్సిందే…!

Nithiin: నితిన్ కి దిల్ రాజు ప్రపోజల్.. మళ్ళీ త్యాగం చేయాల్సిందే…!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Thandel: బుల్లితెరపై కూడా అదరగొట్టిన సాయి పల్లవి ‘తండేల్’

Thandel: బుల్లితెరపై కూడా అదరగొట్టిన సాయి పల్లవి ‘తండేల్’

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

trending news

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

Hari Hara Veeramallu collections: మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన ‘హరిహర వీరమల్లు’

1 hour ago
ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

3 hours ago
Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం

7 hours ago
Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

22 hours ago
Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

Kingdom First Review: విజయ్ దేవరకొండ ఊపిరి పీల్చుకున్నట్టేనా..!?

1 day ago

latest news

ఆ స్టార్‌ హీరో 15 సార్లు కొట్టి.. సారీ చెప్పారు: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

ఆ స్టార్‌ హీరో 15 సార్లు కొట్టి.. సారీ చెప్పారు: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
అప్పుడు చిరు సినిమా వల్ల.. ఇప్పుడు పవన్ సినిమా వల్ల.. లాభాలు లేవు..!

అప్పుడు చిరు సినిమా వల్ల.. ఇప్పుడు పవన్ సినిమా వల్ల.. లాభాలు లేవు..!

6 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న నాని.. ఎందుకంటే..!

Kingdom: ‘కింగ్డమ్’ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న నాని.. ఎందుకంటే..!

6 hours ago
యూట్యూబ్‌లోకి స్టార్‌ హీరో కొత్త సినిమా.. రూ.100 కట్టి చూడొచ్చు

యూట్యూబ్‌లోకి స్టార్‌ హీరో కొత్త సినిమా.. రూ.100 కట్టి చూడొచ్చు

6 hours ago
Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన ‘ది రాజాసాబ్’ టీం..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version