Veera Dheera Soora Collections: కిందామీదా పడుతున్న ‘వీర ధీర శూర’!
- April 2, 2025 / 05:00 PM ISTByPhani Kumar
సినిమా బాగున్నా సరైన ప్రమోషన్ లేకపోతే డ్యామేజ్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పడానికి ‘వీర ధీర శూర’ (Veera Dheera Soora)సినిమాని ఎగ్జాంపుల్ గా చెప్పాలి. ‘తంగలాన్’ (Thangalaan) తతర్వాత చియాన్ విక్రమ్ (Vikram) నుండి వచ్చిన సినిమా ఇది. ‘సేతుపతి’ (Vijay Sethupathi) ‘’చిన్నా’ వంటి సినిమాలు అందించిన ఎస్.యు.అరుణ్ కుమార్ (S. U. Arun Kumar) ఈ సినిమాకి దర్శకుడు. మార్చి 27న ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఆర్థిక లావాదేవీల కారణంగా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు నిలిచిపోయాయి. ఈవెనింగ్ షోలతో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది.
Veera Dheera Soora Collections:

ఎస్.జె.సూర్య(S. J. Suryah) ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. 30 ఇయర్స్ పృథ్వీ(Prudhvi Raj) విలనిజం మెప్పించింది. తెలుగులో ఈ సినిమాని ఎన్.వి.ఆర్ సినిమాస్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేశారు. అయితే ప్రమోషన్స్ సరైన విధంగా చేయకపోవడం వల్ల ‘వీర ధీర శూర’ కలెక్షన్స్ బాగా దెబ్బతిన్నాయి. ఒకసారి (Veera Dheera Soora) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.46 కోట్లు |
| సీడెడ్ | 0.25 కోట్లు |
| ఆంధ్ర(టోటల్) | 0.40 కోట్లు |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.11 కోట్లు |
‘వీర ధీర శూర’ చిత్రానికి రూ.3.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.6 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజుల్లో ఈ సినిమా రూ.1.11 కోట్లు షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.1.96 కోట్లు వచ్చింది. ‘ఎల్ 2 : ఎంపురాన్'(L2: Empuraan) ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) ‘రాబిన్ హుడ్’ (Robinhood) వంటివి ఉండటం వల్ల.. ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేదు.మరి వీక్ డేస్ లో ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి.












