సినీ చరిత్రలో ఏ సంక్రాంతికి కూడా ఒకే బ్యానర్లో రూపొందిన రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సందర్భం లేదు. కానీ ఈ ఏడాది ఆ ఫీట్ ను సాధించింది ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ.బాలకృష్ణతో చేసిన ‘వీరసింహారెడ్డి’, చిరంజీవితో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలను ఒక్కరోజు గ్యాప్లో సంక్రాంతి బరిలో దింపారు. ఈ రెండు సినిమాలు కూడా ఆ హీరోల కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించాయి. అది మామూలు విషయం కాదు.
కానీ ఫ్యాన్స్ మధ్య వార్ లు ఏర్పడటంలో నిర్మాతలు కొన్ని తప్పులు చేశారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కు ముందు చూసుకుంటే.. ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి ఎక్కువ ప్రమోషన్స్ చేశారు. ప్రతి సాంగ్ ను స్పెషల్ గా థియేటర్స్ లో లాంచ్ చేయడం. ఈవెంట్లు పెట్టి లాంచ్ చేయడం వంటివి చేశారు. టైటిల్ లాంచ్ కి అయితే ఏకంగా కర్నూలు వరకు వెళ్లారు. ఇది మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది. రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక మంచి థియేటర్లు వాల్తేరు వీరయ్యకి వెళ్లాయి. ఫ్యామిలీస్ వెళ్లలేని థియేటర్లను వీరసింహారెడ్డికి కేటాయించారు.
ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఇలాంటి ఒత్తిడి ఉంటుంది అనుకుంట. అందులో జరిగిన పొరపాటు కూడా అయ్యుండొచ్చు. సరే అక్కడికి అలా వదిలేసినా.. ఇటీవల ‘వీరసింహారెడ్డి’ వంద రోజుల సెలబ్రేషన్స్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ను వదిలారు. పైగా బాలయ్య వన్ మెన్ షో అన్నట్టు అందులో రాసింది. అంటే ‘వాల్తేరు వీరయ్య’ లో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించడం… ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావడానికి కారణమైంది అన్నట్టు అర్ధం వచ్చింది. అలాగే (Veera Simha Reddy) వీరసింహారెడ్డి వంద రోజుల వేడుక చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు.
కానీ ఐటీ రైడ్స్ వల్ల ఆ సెలబ్రేషన్స్ ఆగిపోయాయి. ఇక నిన్న బాలకృష్ణ పుట్టినరోజు నాడు వందరోజుల సెలబ్రేషన్స్ ని జరిపారు. నిజానికి ఈ సినిమా వంద రోజులు పూర్తయ్యి చాలా రోజులు అయ్యింది. అయినా ఎందుకో నిన్న సెలబ్రేట్ చేశారు. ఇది మెగా అభిమానులకి నచ్చడం లేదు. ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ అని.. ‘వీరసింహారెడ్డి’ వంద కోట్ల షేర్ రాబట్టలేదని మండిపడుతున్నారు. నిర్మాతలు కూడా బాలయ్య తాలూకానే అన్నట్టు ఇంకాస్త పర్సనల్ గా తీసుకుని మరీ వారు ఈ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.