Venkatesh: డేరింగ్ స్టెప్ తీసుకున్న వెంకటేష్… సీన్ రివర్స్..!

ప్రస్తుతం నిర్మాత‌లు మరియు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది.ఓ విధంగా ఇది అంతర్యుద్ధ‌మనే చెప్పాలి.పెద్ద సినిమాలను ఓటిటికి అమ్మొద్దంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు… అలాగే ఓటిటి తప్ప వేరే దారి లేదు అంటూ నిర్మాతలు ఒకరి వాదనను మరొకరు ఖండిస్తున్నారు. డైరెక్ట్ గా సినిమాలను ఓటిటిల్లో విడుదల చేస్తే థియేట‌ర్ల భవిష్యత్తు దారుణంగా తయారవుతుంది అని బయ్యర్లు ఆందోళ‌న చెందుతున్నారు. ‘సేవ్ థియేటర్స్’ అంటూ ఇప్పుడు ఈ టాపిక్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్లకు హీరో వెంకటేష్ అండగా నిలబడ్డాడని తెలుస్తుంది.

తన `నార‌ప్ప‌` ‘దృశ్యం2’ లను థియేటర్లలోనే విడుదల చేయాలని తన అన్న మరియు స్టార్ ప్రొడ్యూసర్ అయిన సురేష్ బాబుకి చెప్పాడట. దీంతో సురేష్ బాబు కూడా అమెజాన్ మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లతో చేసుకున్న ఒప్పందాన్ని వెన‌క్కి తీసుకోవడానికి రెడీ అయినట్టు టాక్. కాకపోతే ఇక్కడ మ‌రో నిర్మాత థాను మాత్రం దీనికి మద్దతు పలకడం లేదట.థియేటర్ రిలీజ్ కంటే కూడా డిజిటల్ రిలీజ్ చేయడం వల్ల లాభాలు వస్తున్నప్పుడు ఎందుకు విరమించుకోవాలని అతను ప్రశ్నిస్తున్నాడట.

అంతేకాదు థియేటర్లలో రిలీజ్ చేయడం వలన న‌ష్టాలే ఎక్కువ‌ని అతను కామెంట్ చేయడంతో ‘నారప్ప’ రిజల్ట్ పై అనుమానాలు కూడా నెలకొన్నాయి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే థియేట్రికల్ రిలీజ్ వల్ల నష్టాలు కనుక వస్తే.. ఈ చిత్రానికి గాను తాను తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడట వెంకీ మామ. మరి టాలీవుడ్లో వెంకటేష్ లా మరికొంత మంది హీరోలు ఈ బాటలో నడిచి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు అండగా నిలబడతారేమో చూడాలి..!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus