టాలీవుడ్‌లో కొత్త దర్శకుల మధ్య పోటీ రోజురోజుకు పెరిగిపోతుంటే, కొంతమంది దర్శకులు ఒక్క సినిమా ఫలితంతోనే మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్నారు. ఆ జాబితాలో తాజాగా చేరినవారిలో వెంకీ కుడుముల (Venky Kudumula) ఒకరు. మంచి స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందిన వెంకీకి ‘ఛలో’(Chalo) ‘భీష్మ’ (Bheeshma)లాంటి సినిమాలతో హిట్ ట్రాక్ పట్టింది. అయితే ఆ మోమెంటాన్ని కొనసాగించలేకపోవడం బాధాకరం. మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) సినిమా చేసే ఛాన్స్ రావడం వెంకీకి కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందనుకున్నారు.
2021లోనే ప్రాజెక్ట్ అనౌన్స్ అయిందీ. కానీ స్క్రిప్ట్ మెరుగుదల కోణంలో చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం ఆ సినిమా నిలిచిపోయేందుకు కారణమైంది. వెంకీకి అది ఒక పెద్ద లాస్. మెగాస్టార్‌తో సినిమా చేయాలంటే ఓ మాస్ అండ్ క్లాస్ బాలెన్స్ ఉండాలి. కానీ వెంకీ అప్పట్లో తగిన మాస్ ఎలిమెంట్స్ కలిపే స్క్రిప్ట్ ఇవ్వలేదనేది టాక్. చిరుతో సినిమా కుదరకపోయినా, ఆయన ఆశలు నితిన్‌తో (Nithiin)పెట్టుకున్న ‘రాబిన్ హుడ్'(Robinhood)పైనే.
శ్రీలీల (Sreeleela) జోడిగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా స్టైలిష్ లుక్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ముందుగానే హైప్ క్రియేట్ చేసింది. కానీ రిజల్ట్ మాత్రం ఊహించిందే. కథలో కొత్తదనం లేకపోవడం, కథనంలో బలహీనతలు సినిమాను డిజాస్టర్‌కు దారి తీశాయి. ఈ ఫెయిల్యూర్‌తో వెంకీ కుడుముల మీద ఉన్న క్రేజ్ కి గండిపడిందనే చెప్పాలి. 2020లో ‘భీష్మ’తో హిట్టయిన తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకుని వచ్చిన సినిమా ఫెయిలవడం, ఇండస్ట్రీలో దర్శకుడిపై నమ్మకం తగ్గించేసే పరిణామం.
ఇప్పుడీ పరిస్థితుల్లో వెంకీ మళ్లీ తనను రీబిల్డ్ చేసుకోవాలి అంటే మళ్లీ కంటెంట్ బేస్డ్ స్టోరీస్ వైపు దృష్టిపెట్టాల్సిందే. వెంకీ కుడుముల త్రివిక్రమ్ (Trivikram) శిష్యుడిగా గుర్తింపు పొందారు. గురూజీ నుంచి నేర్చుకున్నట్లే మాటల మ్యాజిక్, సరదా స్క్రీన్ ప్లే అతడికి సొంతం. ఇప్పుడు ఆ టాలెంట్‌ను మరోసారి రిఫ్రెష్ చేసి, కొత్త కథతో తిరిగి మెగాస్టార్‌ని కలవాలనే టార్గెట్ పెట్టుకుంటే తప్పదు. లేదంటే మరో సాలిడ్ యంగ్ హీరోతో కంటెంట్ బేస్డ్ హిట్ కొట్టే ప్రయత్నం చేయాల్సిందే. వెంకీ కుడుముల ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.