Vettaiyan: ‘వేట్టయన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
- October 10, 2024 / 07:07 PM ISTByFilmy Focus
‘జైలర్’ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు రజినీకాంత్ (Rajinikanth) . ఆ సినిమా రజినీ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది అందరికీ తెలియజేసింది. ఇక ‘జైలర్’ తర్వాత రజినీ హీరోగా రూపొందిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’ (Vettaiyan) . ‘జై భీమ్’ తో ఆకట్టుకున్న టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) ఈ చిత్రానికి దర్శకుడు. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana), రావు రమేష్ (Rao Ramesh) కూడా సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం దర్శకుడు. ‘మనసిలాయో’ సాంగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
Vettaiyan

ఇక ‘జైలర్’ హిట్ అవ్వడంతో ‘వేట్టయన్’ కి మంచి బిజినెస్ జరిగింది. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు, ఏషియన్ సురేష్.. లు కలిసి రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి ‘వేట్టయన్’ థియేట్రికల్ బిజినెస్ ను, బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ని తెలుసుకుందాం రండి :
| నైజాం | 4.00 cr |
| సీడెడ్ | 2.20 cr |
| ఉత్తరాంధ్ర | 1.20 cr |
| ఈస్ట్ | 0.80 cr |
| వెస్ట్ | 0.60 cr |
| గుంటూరు | 0.70 cr |
| కృష్ణా | 0.80 cr |
| నెల్లూరు | 0.40 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 10.70 cr |
‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
















