కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విగ్నేష్ నటీ (Nayanthara) నయనతారను ప్రేమించి గత ఆరు సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ గత ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే వీరి వివాహమైనటువంటి నాలుగు నెలలకే ఈ దంపతులు కవల పిల్లలకు సరోగసి ద్వారా తల్లిదండ్రులుగా మారారు దీంతో పెళ్లైన నాలుగు నెలలకే సరోగసిని ఆశ్రయించడంతో ఈ విషయం కాస్త అప్పట్లో పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఇలా వీరిద్దరూ పిల్లల విషయంలో పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొన్నారు
అయితే అందుకు సంబంధించిన పూర్తి విషయాలన్నింటిని ప్రభుత్వానికి సమర్పించడంతో ఈ వివాదం కాస్త ముగిసింది. అయితే తాజాగా ఈ దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. విగ్నేష్ తండ్రి అన్నదమ్ములు మొత్తం తొమ్మిది మంది విగ్నేష్ తండ్రి పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేసేవారు అయితే ప్రస్తుతం ఈయన లేరు.అయితే ఈయన తన మిగతా సోదరులకు తెలియకుండా ఆస్తిని వేరే వారికి విక్రయించారు అంటూ తన తండ్రి సోదరులు విగ్నేష్ ఫ్యామిలీపై కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే విగ్నేష్ బాబాయ్ అయినటువంటి మాణిక్యం కోయంబత్తూర్ లో నివసిస్తున్నటువంటి మరొక బాబాయ్ కుంచిత పాదం గురువారం తిరుచ్చి డిఎస్పి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మాణిక్యం పేర్కొంటూ విగ్నేష్ శివ తండ్రి మా సోదరుడు మాకు తెలియకుండా ఆస్తిని వేరే వారికి విక్రయించారు. అయితే ప్రస్తుతం ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చి మా ఆస్తి తిరిగి మాకు అప్పగించాలని ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా తమకు తెలియకుండా ఇలాంటి మోసానికి పాల్పడినందుకుగాను విగ్నేష్ తల్లి, తన సోదరి, తన భార్య నయనతార,విగ్నేష్ పై చర్యలు తీసుకోవాలని వీరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే నయనతార విగ్నేష్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఇప్పటివరకు ఈ వార్తలపై విగ్నేష్ ఏ విధంగాను స్పందించలేదు.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!