Vijay Devarakonda: హరీష్ శంకర్ అసలు కథే చెప్పలేదట!

టాలీవుడ్ లో ఉన్న కమర్షియల్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. ఆయన సినిమాలన్నీ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంటాయి. మాస్ పల్స్ తెలిసిన ఈ డైరెక్టర్ చివరిగా ‘గద్దలకొండ గణేష్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా వచ్చి మూడేళ్లు దాటేసినా.. ఇప్పటివరకు హరీష్ శంకర్ నుంచి మరో సినిమా రాలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ హీరోగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు హరీష్ శంకర్.

సినిమా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. పవన్ కి వేరే కమిట్మెంట్స్ ఉండడం వలన హరీష్ శంకర్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పవన్ తో సినిమా అంటే మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అందుకే మరో ఆప్షన్ చూసుకుంటున్నారు హరీష్ శంకర్. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండని కలిసి హరీష్ శంకర్ ఓ కథ చెప్పారని..

ఆ కథ విజయ్ కి నచ్చలేదని గాసిప్స్ పుట్టుకొచ్చాయి. కానీ అసలు విషయం ఏంటంటే..?ఇప్పటివరకు విజయ్ దేవరకొండకి హరీష్ కథ చెప్పలేదట. కథ చెప్పడానికి కొంత సమయం అడిగారట హరీష్ శంకర్. వారం లేదా పది రోజుల్లో ఒక మీటింగ్ ఉంటుందని సమాచారం. ఆ తరువాత ఈ కాంబో సెట్ అవుతుందో లేదో క్లారిటీ వచ్చేస్తుంది.

ఒకవేళ విజయ్ కి గనుక కథ నచ్చితే.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమాను తెరకెక్కించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే హరీష్ శంకర్.. మైత్రి సంస్థ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు. అలానే ఈ సినిమాలో ‘జనగణమన’ నిర్మాతలు కూడా భాగమవుతారని తెలుస్తోంది. ఎందుకంటే పూరితో విజయ్ చేయాల్సిన ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఆ నిర్మాతలకు విజయ్ ఒక సినిమా చేస్తానని మాటిచ్చారు. ఆ విధంగా రెండు బ్యానర్స్ లో సినిమా తెరకెక్కేలా ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus