ఇప్పుడున్న హీరోలలో విజయ్ దేవరకొండది ఓ ప్రత్యేకమైన శైలి. అతను ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోతుంది. కెరీర్ మొదలు పెట్టిన అతి తక్కువ సమయంలోనే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. దాదాపు స్టార్ హీరో అయిపోతాడు అనుకున్న తరుణంలో ‘నోటా’ ‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాలు వెనక్కి లాగేసాయి. అలా అని ఇతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ లో సైతం ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే తను పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేయబోతున్న తదుపరి చిత్రంతో అక్కడ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఈమధ్యే మొదలైంది. ఇక ఓ హార్బర్ సమీపంలో కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ టీమంతా వేరే ప్రదేశానికి బోట్ లో బయల్దేరాల్సి ఉంది. దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మీ.. హీరోయిన్ అనన్య పాండే ముందుగా బోట్ వద్దకు వెళ్లిపోయారు. అయితే విజయ్ కొంచెం లేట్ గా వస్తున్న తరుణంలో.. అక్కడ కొంచెం తడిగా ఉండడం వల్ల కాలు జారీ పడిపోతుండగా.. వెంటనే పక్కనున్న వారు పట్టుకున్నారు. ఇందులో ఏమి తప్పులేదు.. అయినప్పటికీ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. విజయ్ ఏం చేసినా సంచలనం అయిపోతుంది అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
Most Recommended Video
View this post on Instagram
Slippery when wet, cautious #VijayDevarakonda you are precious to all of us✋
A post shared by Filmy Focus (@filmyfocus) on
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!