ఇండస్ట్రీ కి వచ్చిన 5 ఏళ్లలోనే మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో, కెరీర్ ప్రారంభం లో చైనా చిన్న పాత్రల ద్వారా ఆడియన్స్ కి పరిచయమైనా విజయ్, అర్జున్ రెడ్డి చిత్రం తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.
ఇక ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం యూత్ లో ఆయన స్థానంని స్టార్ హీరో రేంజ్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ మీడియం రేంజ్ హీరో కాదు, ప్రస్తుతం టాలీవుడ్ లో 6 స్టార్ హీరోలు ఉన్నారు. వీరి తర్వాత 7 వ స్టార్ హీరో గా విజయ్ దేవరకొండ నిలిచాడు. ఇక సోషల్ మీడియా లో ఈయనకి ఉన్న ఫాలోయింగ్ కొంతమంది స్టార్ హీరోలకు కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా 20 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అల్లు అర్జున్ తర్వాత అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాత్రమే. ఇప్పుడు రీసెంట్ గా ఆయన వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసాడు. ఈ ఛానల్ క్రియేట్ చేసిన అతి తక్కువ రోజుల్లోనే విజయ్ దేవరకొండ కి 1 మిలియన్ కి పైగా ఫాలోవర్లు వచ్చారు. రీసెంట్ గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వాట్సాప్ లోకి వచ్చాడు.
ఆయనకీ ఇప్పటి వరకు కేవలం లక్ష 22 వేల మంది ఫాలోవర్స్ మాత్రమే వచ్చారు. విజయ్ దేవరకొండ తో పోలిస్తే ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోవర్స్ 10 శాతం మాత్రమే. ఇది ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కి అవమానకరమే అని చెప్పాలి. విజయ్ దేవరకొండ కి నార్త్ ఇండియా లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్లే ఎన్టీఆర్ కంటే ఎక్కువ ఫాలోవర్లు వచ్చి ఉంటారు అని అంటున్నారు విశ్లేషకులు.