Vijay Devarakonda: కాలు జారి కింద పడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!
- November 8, 2024 / 05:48 PM ISTByFilmy Focus
ఈ మధ్యనే విజయ్ దేవరకొండకి (Vijay Devarakonda) షూటింగ్లో గాయమైంది. తన భుజానికి చికిత్స కూడా చేయించుకున్నాడు. బహుశా ఇంకా అతనికి నీరసంగానే ఉందేమో.. ఈరోజు మరోసారి కాలుజారి కింద పడ్డాడు. విషయంలోకి వెళితే.. ‘సాహిబా’ అనే మ్యూజిక్ ఆల్బమ్ తో ప్రేక్షకులను, అభిమానులను అలరించేందుకు విజయ్ రెడీ అయ్యాడు. ఈ సాంగ్లో విజయ్…రాధిక మదన్ కి జోడీగా కనిపించబోతున్నాడు. ఈ మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్స్ లో భాగంగా ముంబై వెళ్ళాడు విజయ్.
Vijay Devarakonda

ఈవెంట్ అయిన తర్వాత తిరిగి వస్తుండగా.. మెట్లపై నుండి జారి కిందకి పడ్డాడు విజయ్ (Vijay Devarakonda). దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. గతంలో కూడా ‘లైగర్’ (Liger) సినిమా షూటింగ్లో భాగంగా ఓ బోట్ ఎక్కుతూ కింద పడిపోయాడు విజయ్. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. విజయ్ ని అమితంగా ఇష్టపడే వారు ఉన్నారు. కొంతమంది విమర్శించేవారు ఉన్నారు. ఆ విమర్శించే బ్యాచ్ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం ‘జెర్సీ’ (Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్. 70 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇందులో రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడు. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్ గా నటిస్తుండగా.. సత్యదేవ్ (Satya Dev) కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2 పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
మెట్ల మీద నుండి జారీ కిందపడ్డ విజయ్ దేవరకొండ! #VijayDevarakonda pic.twitter.com/xkiF6tUgX4
— Filmy Focus (@FilmyFocus) November 8, 2024












