మరో ఆరు రోజుల్లో ‘కింగ్డమ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస వాయిదాల తర్వాత సినిమాను జులై 31న రిలీజ్ చేయబోతున్నారు. ముందు రోజు అంటే జులై 30న సినిమా ప్రీమియర్ షోలు ఉంటాయి. అంటే ఫలితం తేలడానికి ఐదు రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
సినిమా విడుదల సందర్భంగా ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మాట్లాడారు. అందులో ఈ సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశాడు విజయ్. సినిమా షూటింగ్ చేసేటప్పుడు ప్రతి సీన్‌ని నేను ఆస్వాదిస్తూ చేస్తే.. ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకునేవాణ్ని. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా లాగే అన్నీ హిట్ అవుతాయని కూడా పందెం కాసేవాడిని. వేదికలపై సినిమా గురించి డైలాగ్స్ చెప్పేవాడిని.
కానీ సినిమాలు చేస్తున్న కొద్దీ నాకు ఓ క్లారిటీ వచ్చింది. ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది కాదో, సినిమా విడుదలయ్యే వరకూ ఎవరికీ తెలియదు. ఒక సినిమా విజయం సాధించాలంటే చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి అని విజయ్ చెప్పుకొచ్చాడు. ఆ మాటలు వింటుంటే ఎట్టకేలకు సినిమా ప్రాసెస్ మీద ఐడియా వచ్చింది అనిపిస్తోంది.
ఇక, ‘కింగ్డమ్’ సినిమా ఎలా మొదలైంది అనే విషయం కూడా విజయ్ చెప్పాడు. దర్శకుడు చెప్పిన ఐడియా నచ్చితేనే సినిమా చేస్తానని, ఒక రోజు అలాగే గౌతమ్ తిన్ననూరికి కాల్ చేసి నువ్వు స్క్రిప్ట్ చెప్పు సినిమా చేద్దాం అని అడిగానని విజయ్ తెలిపాడు. ‘గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ జరిగే సంఘర్షణ’ అనే సినిమా ఐడియా గౌతమ్ చెప్పారట. అలా ఈ సినిమా మొదలైందని విజయ్ తెలిపాడు. ఇక ప్రస్తుతం సినిమా నా చేతుల్లో నుంచి వెళ్లిపోయిందని కామెంట్ చేశాడు.
అందుకే తాను జై గౌతమ్, జై అనిరుధ్, జై నవీన్ నూలీ, జై శ్రీరామ్ అంటున్నానన్నాడు. గౌతమ్ ఈ సినిమా దర్శకుడు కాగా, అనిరుథ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇక నవీన్ నూలి కాగా, శ్రీరామ్ అంటే దేవుడు. అంత కష్టపడి రెండు పార్టులుగా తెరకెక్కించిన సినిమా వదిలేసి ఈ నలుగురు చేతుల్లో పెట్టా అని విజయ్ ఎందుకన్నాడో రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.