కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ 2021 సంక్రాంతి పై పడుతుందని అందరూ ముందుగానే అనుకున్నారు. అయినప్పటికీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ బాగానే పికప్ అవుతుంది. అసలు 2021 సంక్రాంతికి థియేటర్లు తెరుచుకుంటాయా.. సినిమాలు విడుదలవుతాయా అనుకున్న ప్రేక్షకులు కొంతలో కొంత హ్యాపీగానే ఫీలవుతున్నారు. 2021 సంక్రాంతికి ఇప్పటి వరకూ 4 సినిమాలు విడుదల కాబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. అందులో రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’..నాలుగవది విజయ్ నటించిన ‘మాష్టర్'(డబ్బింగ్). వీటిలో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ‘మాష్టర్’ సినిమా కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.
ఎందుకంటే ‘ఖైదీ'(2019) వంటి సూపర్ హిట్ ను అంధించిన లోకేష్ కానగరాజన్ డైరెక్ట్ చేసిన మూవీ అనే కారణం ఒకటైతే.. మరొకటి ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండడం మరొక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రం స్టోరీ లైన్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందట.హీరో విజయ్ ఒక యంగ్ ప్రొఫెసర్ అట. అతను మధ్యానికి బానిసై ఉంటాడు. కొన్ని కారణాల వల్ల అతను వేరే ఊరిలో ఉన్న కాలేజీకి ప్రొఫెసర్ గా వెళ్తాడు.
ఆ కాలేజీలో స్టూడెంట్స్ ను విలన్ విజయ్ సేతుపతి తన స్వలాభం కోసం చెయ్యకూడని పనులు చేయిస్తాడు. దీంతో విజయ్ లు ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయని తెలుస్తుంది. ఇక వీరి మధ్య వచ్చే సన్నివేశాలు నువ్వా -నేనా అన్నట్టు ఉంటాయట. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా .. అలాగే మాస్ ఆడియెన్స్ ను కూడా మెప్పించే విధంగా ఉంటాయని సమాచారం. చూస్తుంటే సంక్రాంతి విన్నర్ గా ఈసారి ‘మాష్టర్’ నిలిచినా ఆశ్చర్యం లేదని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.