2021 సంక్రాంతికి 4 సినిమాలు విడుదల కాబోతున్నట్టు అధికారిక ప్రకటించారు ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు.ఈ లిస్ట్ లో రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’, తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాష్టర్'(డబ్బింగ్) వంటి చిత్రాలు ఉన్నాయి. వీటిలో తెలుగు ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాష్టర్’ అనే చెప్పాలి. ‘ఖైదీ'(2019) వంటి సూపర్ హిట్ ను అంధించిన లోకేష్ కానగరాజన్ డైరెక్ట్ చేసిన మూవీ కావడం..అలాగే ఈ చిత్రంలో విజయ్ వంటి స్టార్ హీరోను ఢీ కొట్టే విలన్ గా మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తుండడం వంటివి కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఇక మాస్టర్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ట్రేడ్ పండితులు సమాచారం ప్రకారం .. ఈ చిత్రానికి ఏకంగా 9 కోట్ల బిజినెస్ జరిగిందట. వాటిని ఒకసారి గమనిస్తే…
నైజాం
2.5 cr
ఆంధ్ర
4.5 cr
సీడెడ్
2 cr
ఏపీ +తెలంగాణ
9 cr
తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్ చిత్రానికి 9కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి… 10కోట్ల వరకూ షేర్ ను రాబడితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ కరోనా టైంలో కూడా ఓ తమిళ చిత్రానికి ఇంత పెద్ద మొత్తం బిజినెస్ జరగడం అంటే.. మామూలు విషయం కాదు. విజయ్ గత చిత్రం విజిల్… ఏకంగా 11 కోట్ల షేర్ ను రాబట్టింది. కాబట్టి.. మాస్టర్ టార్గెట్ పెద్ద కష్టం కాదనే చెప్పాలి.