టాలీవుడ్ ఇండస్ట్రీలో తమిళ హీరోలకున్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తమిళ్ హిట్టయ్యారు అంటే ఆల్ మోస్ట్ తెలుగులో కూడా ఎంతో కొంత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కమల్ హాసన్, రజినీకాంత్, సూర్య, కార్తీ, విక్రమ్ వంటి స్టార్స్ ఆల్ మోస్ట్ మన తెలుగు హీరోల రేంజ్ లోనే వారి సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఇక గత కొంతకాలంగా విజయ్ కూడా అదే తరహాలో తెలుగులో తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు.
విజయ్ మాస్టర్ సినిమాకు ప్రస్తుతం తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. జనవరి 13న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. విజయ్ గత సినిమాలు ఏపీ/ తెలంగాణలో 600 థియేటర్స్ లలో కంటే ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవ్వలేదు. చివరగా బిగిల్ 600థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు మాస్టర్ ఏకంగా 650+ థియేటర్స్ లో విడుదల అవుతోంది. ఒక విదంగా ఇది విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్.
చూస్తుంటే ఓపెనింగ్స్ తోనే ఆదరగొట్టేలా ఉన్నాడు. రెండు రోజుల వరకు థియేటర్స్ సంఖ్య తగ్గే ఛాన్స్ లేదట. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ఆ సంఖ్య మరింత పెరగవచ్చు. మరి మాస్టర్ హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో చూడాలి.