Vijayendra Prasad: మహేష్ అభిమానులకు విజయేంద్ర ప్రసాద్ శుభవార్త.. షూట్ ఎప్పుడంటే?

మహేష్  (Mahesh Babu) రాజమౌళి (S. S. Rajamouli)  కాంబో మూవీ ప్రస్తుతం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న క్రేజీ సినిమాలలో ఒకటి కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్న చాలామంది అభిమానులను వేధిస్తోంది. ఈ ఏడాది ఈ సినిమా మొదలయ్యే ఛాన్స్ లేదని ఫ్యాన్స్ భావిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) సైతం అదే విషయాన్ని వెల్లడించారు. మాస్టర్ క్లాస్ బై మిస్టర్ విజయేంద్ర ప్రసాద్ అనే కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ జనవరి నుంచి మొదలుకానుందని ఆయన పేర్కొన్నారు.

Vijayendra Prasad

మహేష్ సినిమా స్క్రిప్ట్ రాయడానికే రెండేళ్ల సమయం పట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలు మహేష్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు గరుడ అనే పవర్ ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

విజయేంద్ర ప్రసాద్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ ను ఈ సినిమా కోసం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో ఇండస్ట్రీని షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్నారు.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

విశ్వంభర టీజర్ విషయంలో ఆయన గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus