‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) దర్శకుడు అనుదీప్ (Anudeep Kv) చాలా కాలంగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లోనే ఉంటూ వచ్చాడు. రవితేజతో సినిమా అనుకున్నారు. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత విశ్వక్ సేన్ (Vishwak Sen) తో అదే బ్యానర్లో ఓ సినిమా సెట్ చేసుకున్నాడు. కానీ విశ్వక్ సేన్ పారితోషికం విషయంలో నాగవంశీ అభ్యంతరం చెప్పడంతో.. ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు. దీంతో అనుదీప్ సితార నుండి బయటకు వచ్చి ‘పీపుల్ మీడియా’ సంస్థని అప్రోచ్ అయ్యాడు.
Vishwak Sen
విశ్వక్ పారితోషికం విషయంలో నిర్మాత విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) అడ్డు చెప్పలేదు. కానీ మిగిలిన విషయాల్లో బడ్జెట్ ను కంట్రోల్లో పెట్టాలని దర్శకుడు అనుదీప్ కి ఆదేశించారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ వంటి విషయాల్లో బడ్జెట్ మళ్ళీ శృతి మించినట్లు టాక్. అందుకే విశ్వప్రసాద్.. అధికారిక ప్రకటన ఇచ్చినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టారట. దీంతో అనుదీప్ మళ్ళీ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ కే వచ్చేసినట్టు తెలుస్తుంది.
నాగవంశీ (Suryadevara Naga Vamsi ) – త్రివిక్రమ్ (Trivikram)..లు కలిసి స్క్రిప్ట్..లో తగు మార్పులు చేసి బడ్జెట్ తగ్గించే ప్రయత్నం చేశారట. అలా ఈ సినిమా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో తెరకెక్కుతున్నట్టు సమాచారం. ‘జాతి రత్నాలు’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనుదీప్.. ఆ తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) తో ‘ప్రిన్స్’ అనే ద్విభాషా చిత్రం చేశాడు. అది డిజాస్టర్ అయ్యింది. మరి విశ్వక్ సేన్ (Vishwak Sen) సినిమాతో అయినా అతను హిట్టు కొట్టి ఫామ్లోకి వస్తాడేమో చూడాలి.