సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు కొన్ని రకాలుగానే సాగాలి. అప్పుడే అందం, చందం. అయితే పరిస్థితులు మారడం, టెక్నాలజీ అందుబాటులోకి రావడం లాంటి కారణాల వల్ల ఈ పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. అలాంటి వాటిలో మ్యూజిక్ సిట్టింగ్స్ ఒకటి. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు కానీ, షెడ్యూల్స్ మధ్యలో వచ్చే గ్యాప్స్‌లో కానీ.. మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగేవి. నిర్మాత, దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు, సినిమా, గీత రచయితలు కలసి ఒక దగ్గర కూర్చుని పాటలు ఫైనల్ చేసేవారు.
గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితులు టాలీవుడ్‌లో కనిపించడం లేదు. అయితే ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ విషయంలో ‘విశ్వంభర’ (Vishwambhara) టీమ్ పాత పద్ధతిని తీసుకొచ్చింది. సినిమా ప్రారంభానికి ముందే లాంఛనంగా మ్యూజిక్ సిట్టింగ్స్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి పాటల్ని ఫైనల్ చేయడానికి మొత్తం టీమ్ అంతా కూర్చుని చర్చిస్తున్నారట. నగర శివార్లలో ఫామ్ హౌస్‌లో ఈ మేరకు చర్చలు, ఉప చర్చలు సాగుతున్నాయని టాక్. సినిమాకు సగం బలం సంగీతమే. ఒకప్పుడు పాటలు హిట్ అయితే, సగం సినిమా హిట్టే అనేవారు కూడా.
అంతలా సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇటు సినిమా టీమ్, అటు ప్రేక్షకులు ఇలానే చూసేవారు. ఇప్పుడు అలాంటి రోజులు తీసుకొద్దాం అని అనుకుంటున్నారో ఏమో.. ‘విశ్వంభర’ టీమ్ భారీగా ఆలోచనలు చేస్తూ పాటల్ని ఫిక్స్ చేస్తున్నారు. ఈ మేరకు సిట్టింగ్స్ జరుగుతున్నాయట. ప్రస్తుతం ‘విశ్వంభర’ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో దర్శకుడు, గీత రచయితలు, గాయనీ గాయకులు, హీరో.. ఇలా అంతా కూర్చుని కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. ఇటీవల కీరవాణి (M. M. Keeravani) పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) ఈ విషయాల్ని ప్రస్తావించారు. ప్రస్తుతం చాలా సినిమాలక స్వర కర్త ఎక్కడో ఉండి నుండో ట్యూన్ పంపితే..
దర్శకుడు ఫోన్లో విని ఓకే చేస్తున్నారు. గీత రచయిత బీచ్ ఒడ్డునో, పెద్ద హోటల్‌లోనే కూర్చుని పాట రాస్తున్నారు. ఈ మొత్తం ఆన్‌లైన్‌లో తీసుకొని పక్క రాష్ట్రంఓల ఉన్న గాయకుడు అక్కడే స్టూడియోలో ఉండి పాడేస్తున్నాడు. అయితే ఇది సరికాదు.. అన్నీ ఒక్క దగ్గరే జరగాలి అని ‘విశ్వంభర’ టీమ్ అనుకుంది. అందుకే పాత తరహా మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాటు చేసింది. బెంగళూరులోని కీరవాణి ఫామ్ హౌస్ చిరంజీవి, కీరవాణి, దర్శకుడు వశిష్ట (Mallidi Vasishta), గాయకుడు రాహుల్, రచయిత చంద్రబోస్ (Chandrabose) కలిసి సంగీత కచేరీ కమ్ మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నారట.