‘భోళా శంకర్’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి ‘విశ్వంభర’ అనే రాబోతున్న సంగతి తెలిసిందే. ‘భోళా శంకర్’ డిజాస్టర్ అవ్వడంతో చిరు.. చాలా కథలు పక్కన పెట్టి.. ‘విశ్వంభర’ కథని ఫైనల్ చేశారు. ‘బింబిసార’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మల్లిడి వశిష్ట్ దీనికి దర్శకుడు. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ చిరంజీవి కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. చిరుకి జోడీగా త్రిష నటిస్తుంది. అలాగే ఆషిక రంగనాథ్,సురభి, ఇషా చావ్లా వంటి భామలు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి జనవరి 10 న ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. జూలై 24న ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. కానీ దానికి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందులో వీఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉంది అంటూ అంతా పెదవి విరిచారు. సోషల్ మీడియాలో అయితే ‘ఆదిపురుష్’ తో పోల్చి మరీ ట్రోల్ చేశారు.
రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టి.. ఇలాంటి విజువల్స్ ఏంటి అంటూ దర్శక నిర్మాతలను ఆడియన్స్ తిట్టిపోశారు. దీంతో మళ్లీ వి.ఎఫ్.ఎక్స్ పై దృష్టి పెట్టింది చిత్ర బృందం. మరికొంత బడ్జెట్ పెట్టి.. ప్యాచ్ వర్క్ వంటివి కూడా చేసింది. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ వదలాల్సిన టైం వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో కాకుండా.. వేరే దర్శకుడి సినిమాలకి కీరవాణి పని చేస్తే.. ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు.
ఆ పాటలు వినరు అనే అభిప్రాయం కూడా ఆడియన్స్ లో ఉంది. సో ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ ను కూడా ట్రోలర్స్ వదిలిపెట్టరు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన టీం.. ఫస్ట్ సింగిల్ గా ‘రామ రామ’ అంటూ డివోషనల్ టచ్ ఉన్న పాటని రిలీజ్ చేయనుంది. అప్పుడు భక్తి భావన కొద్దీ పాటని ట్రోల్ చేయరు. అదీ ‘విశ్వంభర’ టీం సేఫ్ సైడ్ తీసుకున్న నిర్ణయంగా పరిగణించవచ్చు.