Vishwambhara: ఫైనల్ గా ‘విశ్వంభర’ కి ఒక డేట్ దొరికింది!

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా మొదలై 2 ఏళ్ళు కావస్తోంది. మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో మెగా 157 గా ప్రారంభమైన ఈ సినిమా అటు తర్వాత మెగా 156 అయ్యింది. షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వలేదు.2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ వి.ఎఫ్.ఎక్స్ పనులు పెండింగ్లో ఉండటం వల్ల రిలీజ్ సాధ్యపడలేదు. మరోపక్క ఓటీటీ డీల్ కూడా పెండింగ్లో ఉంది.

Vishwambhara

ప్రస్తుతం నిర్మాతలు వాటి పనుల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఇది. గ్లింప్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆలస్యమైనా పర్వాలేదు పర్ఫెక్ట్ గా వి.ఎఫ్.ఎక్స్ అయిన తర్వాతే సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. మొత్తానికి ఆ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి.

కానీ రిలీజ్ డేట్ విషయంలో తర్జనభర్జన అవుతుంది చిత్ర బృందం. తాజాగా వి.ఎఫ్.ఎక్స్ పార్ట్ ను 45 నిమిషాల పాటు చిరు వీక్షించారట. అది సంతృప్తిగా ఉందని చిరు చెప్పారట. దీంతో రిలీజ్ డేట్ పై కూడా ఆయన టీంని ఆరా తీశారట. మొదట సెప్టెంబర్ 25 అనుకున్నా.. ఆ డేట్ కి అఖండ 2, ఓజి రెండిటిలో ఒకటి వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి క్లాష్ తో కాకుండా సోలో రిలీజ్ కోసం చూడాలని చిరు సూచించారట. ఈ క్రమంలో సెప్టెంబర్ 18 డేట్ కి చిరు ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలుస్తుంది. ఒక ఐటెం సాంగ్ షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అది పూర్తయిన వెంటనే టీజర్ తో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

విజయ్ దేవరకొండ మార్కెట్ ని వాడుకోవడం లేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus