Viswam Collections: మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..?
- October 15, 2024 / 03:13 PM ISTByFilmy Focus
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వం’ (Viswam) . కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నరేష్ (Naresh) , వెన్నెల కిషోర్ (Vennela Kishore) వంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని ‘చిత్రాలయం స్టూడియోస్’ సంస్థతో కలిసి నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి పర్వాలేదు అనిపించాయి. అక్టోబర్ 11న విడుదల కాబోతుంది ఈ చిత్రం. గోపీచంద్ గత చిత్రం ‘భీమా’ (Bhimaa) మాస్ సెంటర్స్ లో బాగానే ఆడింది.
Viswam Collections

అందువల్ల బయ్యర్స్ కి ‘విశ్వం’ పై కొంత నమ్మకం కలిగింది. మొదటి రోజు ‘విశ్వం’కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ సో సో గానే వచ్చాయి. ఒకసారి (Viswam) 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
| నైజాం | 1.18 cr |
| సీడెడ్ | 0.49 cr |
| ఉత్తరాంధ్ర | 0.54 cr |
| ఈస్ట్ | 0.11 cr |
| వెస్ట్ | 0.16 cr |
| గుంటూరు | 0.42 cr |
| కృష్ణా | 0.45 cr |
| నెల్లూరు | 0.15 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.60 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.29 cr |
| ఓవర్సీస్ | 0.27 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 4.16 cr |
‘విశ్వం’ చిత్రానికి రూ.12.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ చిత్రం రూ.4.16 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.8.84 కోట్ల షేర్ ను రాబట్టాలి.












