Vithika Sheru: పిల్లల్ని అందుకే కనలేదని చెప్పిన వితికా షేరు.. ఎమోషనల్ అవుతూ?

వరుణ్ సందేశ్ (Varun Sandesh) భార్య, ప్రముఖ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంకర్ వితికా షేరు (Vithika Sheru) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వితికా షేరు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. పిల్లలు అంటే నాకు చాలా ఇష్టమని ఆమె కామెంట్లు చేశారు. మా కుటుంబంలోని చిన్నపిల్లలను నేను జాగ్రత్తగా చూసుకుంటామని వితికా షేరు తెలిపారు.

నాకు పిల్లలను కనడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె కామెంట్లు చేశారు. 2016 సంవత్సరంలో పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిపోవాలని అక్కడికి వెళ్లామని అక్కడే కొంతకాలం ఉన్నామని వితికా షేరు కామెంట్లు చేశారు. 2018 సంవత్సరంలో నేను గర్భవతిని అయ్యానని ఆ సమయంలో మా కుటుంబ సభ్యులందరికీ చెప్పేశామని వితికా షేరు వెల్లడించారు. ఆ సమయంలో సంబరాలు చేసుకున్నామని వితికా షేరు అన్నారు.

కొన్ని రోజుల్లోనే అబార్షన్ అయిందని ఆ తర్వాత మేము ఇండియాకు వచ్చేశామని వితికా షేరు వెల్లడించారు. ఇండియాకు వచ్చిన తర్వాత రెండు నెలలు పీరియడ్స్ రాకపోతే ఆస్పత్రికి వెళ్లానని ఆ సమయంలో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని తెలిసి అబార్షన్ చేసి గర్భసంచి అంతా క్లీన్ చేశారని ఆమె కామెంట్లు చేశారు. ఈ విషయాలను చెప్పే సమయంలో వితిక ఎమోషనల్ అయ్యారు.

ఈ ఘటన జరిగిన తర్వాత నేను, వరుణ్ బిగ్ బాస్ షోకు వెళ్లామని దేవుడు కరుణిస్తే పిల్లల్ని వద్దని భావించే వాళ్లు ఎవరు ఉంటారని ఆమె ప్రశ్నించారు. సొంతంగా ఇల్లు నిర్మించుకుని చెల్లి పెళ్లి చేసిన వితిక కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు ఫీలవుతున్నారు. వితికా షేరు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వరుణ్ సందేశ్ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus