పవన్- సాయి ధరమ్ తేజ్ ప్రాజెక్టు నుండి తప్పుకున్న బుర్రా.. అసలు ఏమైంది?

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో స‌ముద్ర ఖ‌ని దర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ‘వినోదయ సీతం’ కి ఇది రీమేక్. తెలుగులో కూడా సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్షన్ మాత్రమే చేస్తున్నారు. మాట‌లు,మార్పులు, స్క్రీన్ ప్లే మొత్తం త్రివిక్ర‌మ్ చూసుకుంటున్నారు. అయితే మొదట ఈ చిత్రం మాటలు, మార్పులు బాధ్యత అదే స్క్రిప్ట్ బాధ్యతని బుర్రా సాయిమాధ‌వ్‌కి అప్ప‌గించారు. కానీ ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం త్రివిక్ర‌మ్ వచ్చి చేరడం జరిగింది.

బుర్రా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడానికి కారణం త్రివిక్ర‌మ్‌ అని… ఆయనకు బుర్రా చేసిన మార్పులు నచ్చకపోవడం వచ్చే.. ఈ ప్రాజెక్టుకి దూరం చేసినట్లు అంతా చెప్పుకుంటున్నారు.కానీ జరిగింది వేరు. త్రివిక్రమ్ .. మహేష్ ప్రాజెక్టు తో బిజీగా ఉండటం వల్ల ఆయనే బుర్రా సాయి మాధవ్ కు డైలాగ్ వెర్షన్ పనులు ఇప్పించారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్ వెర్షన్ ఫినిష్ చేశారు. అది త్రివిక్రమ్ కు కూడా నచ్చింది.

నిర్మాతలు కూడా సంతృప్తి చెందారు.బుర్రా సాయి మాధవ్ కు డబ్బులు కూడా ఇచ్చేశారు. అయితే అనుకున్న టైంకి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. దీంతో బుర్రా రాసిన డైలాగ్ వెర్షన్ ను పదే పదే చూసిన నిర్మాతలకు.. అందులో పవన్ రోల్ కంటే సాయి ధరమ్ తేజ్ రోల్ నిడివి ఎక్కువైంది అనే భావన కలిగింది.ఈ సినిమా టికెట్లు ఎక్కువ తెగేదే పవన్ కళ్యాణ్ కోసం కాబట్టి.. మళ్ళీ త్రివిక్రమ్ తో సిట్టింగ్ వేసి ఆ విషయాన్ని చెప్పారు.

త్రివిక్రమ్.. నిర్మాతల మాటలను కాదనలేక మళ్ళీ పవన్ రోల్ ను పెంచుతూ మార్పులు చేశారు. మళ్ళీ బుర్రాని పిలిచి వాటికి సంభాషణలు రాయమని అడగ్గా… ‘మీ ఐడియాలజీకి తగ్గట్టు మార్చుకుని నన్ను డైలాగులు రాయమంటే ఎలా? పైగా నేను వేరే ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా ఉన్నాను’ అంటూ చెప్పారట బుర్రా. అతని బాధని అర్థం చేసుకుని త్రివిక్రమే సంభాషణలు కూడా రాసేస్తున్నారు. సో అటు బుర్రాకి ఇబ్బంది లేదు పైగా.. త్రివిక్రమ్ పెన్ను పెడుతున్నాడు కాబట్టి పవన్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus