టాలీవుడ్ ఇండస్ట్రీలో 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో ప్రాజెక్ట్ కే కూడా ఒకటనే సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తైంది. మొదట ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జే మేయర్ ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన స్థానంలో మరో మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేశారు.
మిక్కీ జే మేయర్ స్థానంలో సంతోష్ నారాయణన్ వచ్చి చేరడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ మార్పు ఎందుకు జరిగిందనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. దీపికా పదుకొనే ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో నటిస్తున్నారు. యుగాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రాజెక్ట్ కే టైటిల్ వర్కింగ్ టైటిల్ కాగా ఈ సినిమాకు మరో టైటిల్ ను ప్రకటిస్తారో లేక చివరకు ఇదే టైటిల్ ఫైనల్ అవుతుందో చూడాల్సి ఉంది. ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ మార్పు ఎందుకు జరిగిందనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఐదారు కంపెనీలు ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులను చూసుకుంటున్నాయని తెలుస్తోంది.
తమిళంలో పలు సినిమాలకు సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ తెలుగులో కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది. ప్రాజెక్ట్ కే రిజల్ట్ విషయంలో ప్రభాస్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమా నైజాం హక్కులు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.