క్లాస్, మాస్ హిట్ సినిమాలు అందిస్తూ గుర్తింపు అందుకున్న వారిలో మారుతి (Maruthi Dasari) ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు. ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ వంటి సినిమాలతో తొలి గుర్తింపు తెచ్చుకున్న అతను, ‘భలే భలే మగాడివోయ్’ (Bhale Bhale Magadivoy), ‘ప్రేమ కథా చిత్రం’ (Prema Katha Chitram), ‘ప్రతీ రోజు పండగే’ (Prati Roju Pandage) లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో తన మార్క్‌ను పెంచుకున్నాడు. ఇప్పుడు మాత్రం పూర్తిగా కొత్త ఛాప్టర్ తెరలేపాడు. రెబల్ స్టార్ ప్రభాస్‌తో (Prabhas) చేస్తున్న ‘రాజా సాబ్’ (The Rajasaab) సినిమాతో తన కెరీర్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటి నుంచి మారుతిపై టాలీవుడ్‌లో విభిన్నమైన స్పందనలు వచ్చాయి. ప్రభాస్ వంటి స్టార్‌కి తగ్గ దర్శకుడిగా మారుతి సెట్ అవుతాడా? అన్న సందేహాలూ ఎదురయ్యాయి. అందుకే ‘రాజా సాబ్’ విషయంలో మారుతి కాస్త ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ బయటకు రాకపోవడం వల్ల ఫ్యాన్స్ మధ్యలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మారుతి మాత్రం ప్రశాంతంగా తన పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
అతనికి ఇది కేవలం మరో సినిమా కాదు. కెరీర్‌ను కొత్త లెవెల్‌కి తీసుకెళ్లే అవకాశం. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై అన్ని విషయాల్లో పర్ఫెక్షన్‌కి ప్రాధాన్యం ఇస్తున్నాడు. విజువల్స్, మ్యూజిక్, కథా నిర్మాణం, క్యారెక్టరైజేషన్.. అన్ని అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ అభిమానులకు నచ్చేలా మాస్, ఎమోషన్ మిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే సినిమా బ్లాక్‌బస్టర్ అయితే, ఇక మారుతి ఫ్యూచర్ దిశే మరోలెవెల్‌లో ఉంటుంది. రాజా సాబ్ తర్వాత మారుతి మళ్లీ పాన్ ఇండియా స్థాయిలోనే తదుపరి ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రభాస్‌తో పని చేసిన అనుభవం అతనికి కొత్త అవకాశాల బాట వేసే అవకాశం ఉంది. అటు బాలీవుడ్ నుండి కూడా మంచి హీరోలతో డీల్ చేసేందుకు మారుతికి గ్రీన్ సిగ్నల్స్ రావొచ్చు. ముఖ్యంగా ఈ సినిమా విజయవంతమైతే స్టార్స్ అతన్ని స్వయంగా ఆహ్వానించే స్థాయికి వెళ్లే ఛాన్స్ ఉంది. మొత్తానికి మారుతి కెరీర్‌లో అత్యంత కీలక దశగా ‘రాజా సాబ్’ మారబోతోంది. ఇది బ్లాక్ బస్టర్ అయితే, ఇక అతని దారి తక్కువ దర్శకులకే అందే అవకాశాలతో నిండిపోతుంది. మరి మారుతి రిస్క్ వర్కౌట్ అవుతుందా? లేక అది ప్రయోగంగా మిగిలిపోతుందా అన్నది త్వరలో తేలనుంది.