డ్రగ్స్ తీసుకున్న స్టార్ల భార్యలు.. షెర్లిన్ వీడియో వైరల్!

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా డ్రగ్స్ గురించి మాట్లాడిన పాత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో షారుఖ్ ఖాన్ ఇచ్చిన పార్టీలో తను చూసిన విషయాల గురించి షెర్లిన్ చెప్పుకొచ్చింది.

షారుఖ్ ఖాన్ కి ఐపీఎల్ కోల్‌కతా నైట్ రైడర్ అనే టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. వారికోసం ఓ స్పెషల్ పార్టీ ఇచ్చాడు షారుఖ్. ఆ పార్టీకి షెర్లిన్ కూడా వెళ్లింది. దాని గురించి ఆమె మాట్లాడింది. పార్టీలో డాన్స్ చేసి అలసిపోయిన తను వాష్ రూమ్ కి వెళ్లిందట. డోర్ ఓపెన్ చేయగానే అక్కడ సీన్ చూసి షాక్ అయింది. ఒక్క క్షణం తరువాత తనకు విషయం అర్థమైందని చెప్పుకొచ్చింది.

అక్కడున్న బాలీవుడ్ స్టార్ల భార్యలందరూ అద్దాల ముందు నిల్చొని తెల్లని పౌడర్ పీలుస్తున్నారట. వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని అర్ధమై షాకయ్యాయని తెలిపింది. వారిని చూసి నవ్వి బయటకు వచ్చేశానని.. ఆ తరువాత షారుఖ్ కి, అతడి స్నేహితులకు గుడ్ బై చెప్పి వెళ్లిపోయా అని వివరించింది. బాలీవుడ్ లో జరిగే పార్టీల గురించి ఆరోజే పూర్తిగా తెలిసిందని ఈ బ్యూటీ తెలిపింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.