రాజా గౌతమ్ (Raja Goutham) – బ్రహ్మానందం (Brahmanandam) సినిమా ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఆ వేదిక మీద చిరంజీవి (Chiranjeevi) నోరు జారిన విషయం ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘రెడ్ ఫేస్, ఎర్ర ఫేస్’ అంటూ చిరంజీవి పదే పదే అనడం కొంతమందికి నచ్చడం లేదు. మధ్యలో ఓ అసభ్యకర పదం కూడా అన్నారు అని కామెంట్లు చేస్తున్నారు. చిరు మాటలు ఇబ్బందికరమైనవే.. అయితే ఈ క్రమంలో మరో ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతోంది.
‘బ్రహ్మా ఆనందం’ సినిమాకు ఈ మధ్య కాలంలో కాస్త హైప్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఇంకాస్త పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో బ్రహ్మానందం ఓ పెద్ద హీరోను పిలిచి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాం అనుకున్నారట. దీని కోసం ఓ ఇద్దరు హీరోలను టీమ్ సంప్రదించిందట. బ్రహ్మానందం కూడా మాట్లాడారట. కానీ ఏమైందో ఏమో ఆ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు హ్యాండ్ ఇచ్చారట. దీంతో ఆఖరి నిమిషంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి మెయిన్ గెస్ట్ అయ్యారట.
ఈ విషయాన్ని చిరంజీవే నిన్న ఈవెంట్ వేదిక మీద చెప్పుకొచ్చారు. ఆ సమయంలో బ్రహ్మానందం ముఖం చాలా డల్‌గా కనిపించింది. అంత పెద్ద నటుడు, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ సినిమా ఈవెంట్‌కు గెస్టుగా రమ్మని అడిగితే నో చెబితే ఇలానే అనిపిస్తుంది మరి. ఈ నేపథ్యంలో బ్రహ్మీతో అంత అనుబంధం ఉండి రాను అని చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనే చర్చ మొదలైంది. ఆయనకు కొంతమంది హీరోలతో కాదు హీరోలందరితో మంచి అనుబంధమే ఉంది.
దీంతో ఆ ఇద్దరు ఎవరు అనేది ఈజీగా చెప్పలేం. కానీ ఆ హ్యాండిచ్చిన హీరోలకు అయితే ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. నెటిజన్లు చిరంజీవి తప్పు మాటను ఎంతగా తూర్పారబడుతున్నారో.. ఆ ఇద్దరు హీరోల గురించి మాట్లాడాల్సి ఉంటుంది.