టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఆర్ఆర్ఆర్ (RRR Movie) ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో నైజాంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు నైజాం ఏరియాలో 23.3 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా తర్వాత స్థానాల్లో సలార్(Salaar) , ఆదిపురుష్ (Adipurush) , గుంటూరు కారం (Guntur Kaaram) , సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ నైజాం రికార్డ్ బ్రేక్ అవుతుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది.
తొలిరోజే ఒక సినిమాకు 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు రావడం సులువు కాదు. భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడితే మాత్రమే ఈ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. కల్కి (Kalki 2898 AD) , దేవర (Devara) , పుష్ప ది రూల్ (Pushpa2) , ఓజీ (OG Movie) , గేమ్ ఛేంజర్ (Game Changer) లలో ఏ సినిమా అయినా ఈ కలెక్షన్ల రికార్డ్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాలలో అన్ని సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
నైజాం ఏరియాలో పెద్ద సినిమాల హక్కులు సైతం 40 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడవుతున్నాయి. మైత్రీ నిర్మాతలు, దిల్ రాజు (Dil Raju) , మరి కొందరు నిర్మాతలు మాత్రమే నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే సులువుగానే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు టార్గెట్లు సైతం ఒకింత భారీగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సినిమాలకు టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి అనుమతులు ఇస్తుండటం కూడా ఆ సినిమాలకు ప్లస్ అవుతోంది. నార్త్ ఇండియాలో ప్రస్తుతం మరీ భారీ సినిమాలేవీ తెరకెక్కడం లేదు. నార్త్ ఇండియా ప్రేక్షకులు సైతం సౌత్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.