ఎస్.ఎస్. తమన్‌కు ఇండస్ట్రీలో ఓ ముద్దు పేరు ఉంది. అదే ష్యూర్ సక్సెస్ తమన్ అని. అయితే స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ఇంకో ముద్దు పేరు ఉండేదట తెలుసా? చిన్నతనంలో స్కూల్లో తమన్ చేసిన పనికి… నీల్ డౌన్ స్టార్ అని పిలిచేవారట. అంటే మోకాళ్లపై కూర్చునే స్టార్ అది. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆ వివరాల్ని తమన్ ఓ టీవీ షోలో చెప్పుకొచ్చారు. ఆ కార్యక్రమం ప్రోమో వచ్చేసరికి ఈ ఆసక్తికర విషయాలను బయటికొచ్చాయి.
తమన్ నిజానికి చదువుకున్నది కేవలం ఆరో తరగతి వరకేనట. ఆ తర్వాత చదువు మానేసి సంగీతం వైపు వచ్చేశారు. తమన్ చదువుకునే రోజుల్లో క్లాస్‌లో కూర్చుని తమన్ పాఠాలు వినేవాడు కాదట. బెంచీల మీద డప్పు కొట్టేవాడట. ఆ క్రమంలో జరిగిన కొన్ని పనులే అతనికి నీల్ డౌన్ స్టార్‌ను చేసింది. పాఠాలు వినడం మానేసి… డప్పు వాయిస్తున్నాడని చెప్పి టీచర్లు తమన్‌ను బయట మోకాళ్ల మీద కూర్చోబెట్టేవారట. దీంతో అందరూ అతనిని నీల్‌డౌన్ స్టార్ అని పిలిచేవారట.
ఆ రోజుల్ని గుర్తు చేసుకొని మురిసిపోతుంటాడు తమన్. మరి మ్యూజికల్ స్టార్ అయ్యాక కలిశావా… అంటే కలిశాను అంటూ మురిసిపోయారు తమన్. అయితే చదువు విషయంలో తమన్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. వాటి అందరూ అనుసరిస్తే కష్టం కానీ… ఆలోచనలు అయితే వేరేగానే ఉన్నాయి. విద్య గురించి తమన్ మాట్లాడుతూ… ‘‘నేను ఐదో తరగతిలో చదువుకున్న ఆల్‌జీబ్రా ఇప్పుడు నాకు ఉపయోగపడటం లేదు. అందరూ ఓ పడిపోయి పడిపోయి ఎందుకు చదివేస్తారో?’’ అని ప్రశ్నించాడు తమన్.
అయితే అతను అలా అన్నాడని అందరూ చదువు మానేయమని కాదు. ఆయన రంగానికి ఆ చదువు ఉపయోగపడలేదు. ఆ రంగంలో రాణించడం కోసం తమన్ చాలా కష్టాలు పడ్డారు. ఎన్నో బాధలు అనుభవించారు. కాబట్టి తమన్ చెప్పాడు కదా అని చదువులు మానేయడం లాంటివి చేయకూడదు. ఇప్పుడు తమన్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు అంటే ఆయన పడ్డ కష్టమే కారణం.