రాజమౌళి తర్వాత అపజయం ఎరగని దర్శకుడుగా కొరటాల శివ పేరు చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు హిట్లే. అంతేకాకుండా ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు కూడా ఆ చిత్రాల్లో నటించిన హీరోల కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. అయితే ‘ఆచార్య’ కోసం కొరటాల దాదాపు 4 ఏళ్ళు కేటాయించాడు. ఏడాదికి ఒక సినిమా అనుకున్నా.. సినిమాకు రూ.10 కోట్లు అతనికి పారితోషికం అనుకున్నా..
‘ఆచార్య’ వల్ల అతను రూ.30 కోట్లు నష్టపోయినట్టే. కరోనా వల్ల 2 సంవత్సరాలు తీసేసినా.. ఇంకో రెండేళ్ళు ఈ మూవీ కోసం కేటాయించాడు కాబట్టి.. కొరటాలలో అసహనం పెరిగిపోయినట్టు స్పష్టమవుతుంది.అందుకే ఆయన తన కోపాన్ని ప్రమోషన్లలో బయటపెడుతున్నారు. విషయం ఏంటంటే.. ‘ఆచార్య’ లో కాజల్ రోల్ ను ట్రిమ్ చేశారు. నక్సలిజంలో ఉన్న హీరోకి లవ్ ట్రాక్ పెడితే బాగోదు అనే ఉద్దేశంతో 4 రోజుల షూటింగ్ తర్వాత కాజల్ రోల్ తీసినట్టు అతను బదులిచ్చాడు.
అయితే చిరంజీవి సినిమాలో హీరోయిన్ ట్రాక్ లేకపోవడం ఏంటి అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు.ఇది అభిమానుల్లో ఉన్న ప్రశ్న కూడా..! దీనికి కొరటాల ఫైర్ అయ్యాడు. ‘నేను చెప్పాను కదా సమాధానం, ఆయన(చిరు) నోట్లో నుండీ కూడా వినాలా?’ అంటూ మండిపడ్డాడు. కాజల్ ప్రెగ్నెన్సీ వల్ల ఈ సినిమా నుండీ తప్పుకుంది అని చాలా మంది చెబుతున్న సమాధానం. కొరటాల మాత్రం ‘ఆచార్య’ కి లవ్ ట్రాక్ పెడితే బాగోదు అంటూ చెబుతున్నారు.
మరి ఐటెం సాంగ్స్ వంటివి పెట్టి ‘ఆచార్య’ తో స్టెప్పులు ఎందుకు వేయించినట్టు? అనే ప్రశ్న కూడా కొరటాలకి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ముందు జాగ్రత్తగా ఆ ప్రశ్నని సైడ్ ట్రాక్ కు నెట్టేశాడు కొరటాల. ఈ సినిమా పూర్తి చేయడానికి కొరటాల పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు. ఈ మూవీలో నటించటానికి హీరోయిన్లు ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత సెట్లు ధ్వంసమయ్యాయి.ఇష్టం లేకుండా మణిశర్మని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ కోసం నచ్చనివి చాలానే చేసాడు కొరటాల.