Mahesh Babu, Rajamouli: మహేష్‌ – రాజమౌళి చెబుతున్న డేట్‌ సాధ్యమేనా..?

పోస్ట్‌పోన్‌.. పోస్ట్‌పోన్‌.. పోస్ట్‌పోన్‌… ఐ హేట్‌ పోస్ట్‌పోన్, బట్‌ పోస్ట్‌పోన్‌ లైక్స్‌ హిమ్‌. ఇదంతా ఎవరి గురించో మీకు అర్థమైపోయుంటుంది. జక్కన్న టాలీవుడ్‌ జనాలు పిలుచుకునే రాజమౌళి గురించి. స్టార్‌ డైరక్టర్‌గా మారిన తర్వాత ఆయన సినిమాలన్నీ భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. అలాగే సినిమా రిలీజ్‌ డేట్స్‌ విషయంలో వాయిదాలు కూడా భారీగానే ఉంటున్నాయి. ‘బాహుబలి’ రెండు పార్టులు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో ఇదే చూశాం. ఇప్పుడు మహేష్‌ సినిమా పరిస్థితీ అంతే. అయితే ఇక్కడో మెలిక ఉంది.

ఆ మెలిక ఏంటో తెలియాలంటే… రాజమౌళి, మహేష్‌బాబు సినిమా ఎప్పుడు అనౌన్స్‌ అయ్యింది అనేది చూడాలి. ఎప్పుడు 2020లో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అయితే అప్పటికే అంటే ‘బాహుబలి’ వచ్చిన వెంటనే మహేష్‌ – రాజమౌళి సినిమా గురించి చర్చ జరగింది. ఇదిగో, అదిగో అంటున్నా సరైన సమాచారం లేకుండా ఉండేది. అయితే ఒకానొక రోజు కేఎల్‌ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని చెప్పేశారు. అప్పటి నుండి సినిమా ఓపెనింగ్‌ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి సినిమా షూటింగ్‌ అవుతున్నప్పుడు, రిలీజ్‌ విషయంలో వాయిదాలు గురించి ఇన్నాళ్లూ విన్న ప్రేక్షకులు… మహేష్‌బాబు సినిమా దగ్గరకు వచ్చేసరికి ఓపెనింగ్‌ విషయంలోనే వాయిదాలు అనే మాట వింటున్నాం. ‘ఆర్ఆర్ఆర్‌’ అయిపోయిన వెంటనే సినిమాఅని అన్నారు. ఇప్పుడు చూస్తే కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ మాటలు వింటుంటే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఉండొచ్చు అని తెలుస్తోంది. మహేష్‌బాబు సినిమా కథ ఇంకా పూర్తవ్వలేదని, త్వరలోనే పూర్తి అవుతుందని విజయేంద్రప్రసాద్‌ చెప్పారు.

ఆ లెక్కన కథ సిద్ధమై మహేష్‌ విని, మార్పులు ఏవైనా ఉంటే చెప్పి, వాటిని చేసి… అబ్బో చాలా రోజులే పట్టే అవకాశం ఉంది. కథ ఓకే అయ్యాక దానికి చిత్రానువాదం చేయాలి. తాను బేసిక్‌ కథ మాత్రమే ఇస్తానని, దానిని రాజమౌళి సినిమాకు తగ్గట్టుగా మార్చుకుంటారని గతంలో విజయేంద్రప్రసాద్‌ చెప్పిన విషయం విదితమే. ఆ లెక్కన ఆయన చెప్పినట్లు 2023 తొలి అర్ధ భాగంలో సినిమా మొదలయ్యే అవకాశాలు చాలా తక్కువ.

ఒకవేళ జూన్‌లోపు సినిమా మొదలైనా.. జక్కన్న సినిమా షూటింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్‌, వీఎఫ్‌ఎక్స్‌ ఇలా చాలా రోజులే అవుతాయి. గత చిత్ర అనుభవాల దృష్ట్యా కనీసం సంవత్సరంన్నర నుండి రెండేళ్లు పడుతుందని అనుకోవచ్చు. అంతకంటే ముందు అయిపోతే ఆనందమే. సో మహేష్‌ నుండి 2023, 2024లో సినిమాలు ఏవీ రాకపోవచ్చు. మహేష్‌ పునర్దర్శనం 2025లో ఉంటుంది అని చెప్పొచ్చు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus