స్టార్ హీరోల లైనప్పులు ఎప్పుడూ పెద్ద డైరెక్టర్లతోనే ఉంటాయి. వెంటనే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసినా చేయకపోయినా.. స్టార్ హీరోలు వాళ్ళతో సినిమాలు అనౌన్స్ చేసేస్తారు. అది నిర్మాతకి బిజినెస్ పర్పస్ యూజ్ అవుతుంది అనేది ఇన్సైడ్ లాజిక్. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఎన్టీఆర్ (Jr NTR)– త్రివిక్రమ్ (Trivikram)..లది హిట్టు కాంబినేషన్. ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) తో వీళ్ళు మంచి హిట్టు కొట్టారు. ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చింది ఆ సినిమా. అసలు అది త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడు అంటే నమ్మడం కష్టం.
ఎందుకంటే అందులో అంత మాస్ ఉంటుంది. ఎన్టీఆర్ కి మాస్లో ఉన్న పవర్ ఏంటన్నది ఆ సినిమా ప్రూవ్ చేసింది. త్రివిక్రమ్ వర్క్ కి ఇంప్రెస్ అయిపోయిన ఎన్టీఆర్.. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తానని ప్రకటించాడు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ లేట్ అవుతుందని భావించి మహేష్ (Mahesh Babu) తో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సెట్ చేసుకున్నాడు గురూజీ. అలా ఎన్టీఆర్ – త్రివిక్రమ్..ల ప్రాజెక్టు అటకెక్కింది. సరిగ్గా అల్లు అర్జున్ (Allu Arjun) విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతుందనిపిస్తుంది.
‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ (Naa Peru Surya, Naa Illu India) సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న అల్లు అర్జున్ కి.. వెంటనే ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) వంటి సక్సెస్ ఇచ్చి ఆదుకున్నాడు త్రివిక్రమ్. అది నాన్-బాహుబలి (Baahubali) ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకి అల్లు అర్జున్ కి దక్కిన క్రెడిట్ ఎక్కువగా ఏమీ లేదు. మొత్తం త్రివిక్రమ్ మార్క్ మీదే ఆడిన సినిమా అది. అయినప్పటికీ అల్లు అర్జున్ కి ఓ సాలిడ్ హిట్ పడింది.
అందుకే సుకుమార్ తో (Sukumar) ‘పుష్ప’ (Pushpa) ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ సినిమా అని అల్లు అర్జున్ ప్రకటించాడు. ఈ సారి కూడా ఆల్మోస్ట్ సేమ్ సీన్. అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ పాన్ ఇండియా సబ్జెక్ట్ సరిగ్గా డిజైన్ చేయలేకపోతున్నాడు. అందువల్ల ఇంకాస్త టైం కోరినట్టు తెలుస్తోంది. అందుకే అల్లు అర్జున్.. అట్లీ (Atlee Kumar) ప్రాజెక్టు సెట్ చేసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 3 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చాడు అల్లు అర్జున్.
అక్కడ ఒక వెల్ఫేర్ అసోసియేషన్లో చేరి నెక్స్ట్ సినిమా కోసం ఫిజిక్ డెవలప్ చేసుకుంటూనే.. స్టార్ హోటల్లో అట్లీ అండ్ టీంతో సిట్టింగ్లు కూడా వేసి వచ్చాడు బన్నీ. ‘సన్ పిక్చర్స్’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బన్నీ సంగతి ఓకే.. మరి త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సంగతేంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.