Akhanda Movie: పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అఖండ మూవీ.. కానీ?

స్టార్ హీరో బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, లెజెండ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన మరో మూవీ అఖండ ఈరోజు థియేటర్లలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా? లేదా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. అఖండ మూవీ బాలయ్య అభిమానులకు బాగా నచ్చేసింది.

ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు కూడా ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లలో సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అఖండపై ఆసక్తి చూపిస్తారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే. మరోవైపు బాలయ్య కెరీర్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాలు ఈ మధ్య కాలంలో లేవు.

55 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కనీసం 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి బాలయ్య కెరీర్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ స్థాయిలో అఖండ కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే కథాంశంతో తెరకెక్కిన అఖండ సినిమాలో కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల ప్రభావం అఖండ మూవీపై భారీగా పడనుందని తెలుస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus