Acharya Movie: ఆచార్య వల్ల మెగా హీరోలకు అన్ని రూ.కోట్ల నష్టమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలైన చిరంజీవి, చరణ్ లకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ ఇద్దరు హీరోలకు రెమ్యునరేషన్ గా 70 కోట్ల రూపాయలు ఆచార్య సినిమాకు సంబంధించి అందాల్సి ఉంది. కొణిదెల బ్యానర్ పైనే ఆచార్య తెరకెక్కిందని వార్తలు ప్రచారంలోకి వచ్చినా నిరంజన్ రెడ్డి సోలోగా ఈ సినిమాను నిర్మించారని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే విడుదలకు ముందు హీరోలు, దర్శకుడు కొరటాల శివ పారితోషికం తీసుకోలేదు.

అయితే ఆచార్య రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో బయ్యర్లను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా నిర్మాతలపై పడింది. నిర్మాతలు బయ్యర్లను ఆదుకుని చిరంజీవి, చరణ్ లకు పారితోషికం చెల్లించడం సులువైన విషయం అయితే కాదు. ఆచార్య కలెక్షన్లు తొలిరోజుతో పోల్చి చూస్తే రెండో రోజుకు సగానికి పైగా తగ్గాయని కామెంట్లు వినిపించాయి. సోమవారం నుంచి ఈ సినిమా థియేటర్ల సంఖ్య కూడా తగ్గనుందని సమాచారం అందుతోంది. చిరంజీవి, చరణ్ కెరీర్ లపై ఆచార్య ఎఫెక్ట్ పడుతుందో లేదో చూడాల్సి ఉంది.

తర్వాత సినిమాలతో మెగా హీరోలు సక్సెస్ సాధించాల్సి ఉంది. రాజమౌళి, పూజా హెగ్డేల నెగిటివ్ సెంటిమెంట్లతో పాటు రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడం ఈ సినిమాకు మైనస్ అయింది. ఆచార్య ఫ్లాప్ చిరంజీవిని సైతం ఒకింత బాధ పెట్టిందని తెలుస్తోంది. కొరటాల శివ మాత్రం తన తర్వాత సినిమాపై దృష్టి పెట్టారని భోగట్టా. ఎన్టీఆర్ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని విమర్శలకు చెక్ పెట్టాలని కొరటాల శివ భావిస్తున్నారు.

ఆచార్య సినిమాకు ఎన్టీఆర్ సినిమాకు నిర్మాతలు వేరు కాబట్టి ఈ సినిమా ఎఫెక్ట్ ఆ సినిమాపై పడే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. ఈ ఏడాది విడుదలైన పెద్ద సినిమాలలో ఒకటైన ఆచార్య ఫ్లాప్ గా నిలవడం అభిమానులను ఎంతగానో బాధపెడుతోంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus