Shruti Haasan: చిరంజీవి, బాలయ్య ఆమె జాతకాన్ని మారుస్తారా?

  • December 21, 2022 / 06:34 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలలో హీరోయిన్ గా నటించారు. శృతి హాసన్ వయస్సు ప్రస్తుతం 36 సంవత్సరాలు అయినా ఆమె పాతికేళ్ల అమ్మాయిలానే కనిపిస్తున్నారని చాలామంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటైన సలార్ మూవీలో శృతి హాసన్ జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. అయితే ఈ మధ్య కాలంలో శృతి హాసన్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ల ప్రకటనలేవీ రావడం లేదు.

శృతి హాసన్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదా? లేక ఆమెకు కొత్త ప్రాజెక్ట్ లలో ఛాన్స్ లు రావడం లేదా? అనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకడం లేదు. సాధారణంగా శృతి హాసన్ కు వరుస ప్రాజెక్ట్ లలో నటించి బ్రేక్ తీసుకోవడం అలవాటుగా ఉంది. ఈ అలవాటు వల్లే శృతి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించడం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరోవైపు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు విడుదలై సక్సెస్ సాధిస్తే శృతి హాసన్ కు కొత్త ఆఫర్లు రావడం గ్యారంటీ అని మరి కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్యలో ట్రెడిషనల్ లుక్ లో, వీరసింహారెడ్డి సినిమాలో గ్లామరస్ లుక్ లో కనిపిస్తున్న శృతి హాసన్ ఈ రెండు సినిమాల లుక్స్ తో ఆకట్టుకున్నారు. ఈ రెండు సినిమాలలో శృతి హాసన్ పాత్రలకు ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవి, బాలయ్య సినిమాలతో శృతి జాతకం మారిపోతుందని కామెంట్లు వినిపిస్తుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

జనవరి ఫస్ట్ వీక్ నుంచి శృతి హాసన్ ఈ రెండు సినిమాల ప్రమోషన్లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్న శృతి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus