ప్రభాస్ (Prabhas) ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్. ‘బాహుబలి'(సిరీస్) తో (Baahubali) అతని రేంజ్ పీక్స్ కి వెళ్ళింది. వాస్తవానికి చెప్పుకోవాలంటే ‘బాహుబలి 2’ (Baahubali 2) తర్వాత ప్రభాస్ ఖాతాలో ఆ స్థాయి హిట్టు పడలేదు. ‘సలార్’ (Salaar) పర్వాలేదు అనిపించింది కానీ.. ‘డంకీ’ (Dunki) వంటి సినిమాతో పోటీగా రావడం వల్ల.. రికార్డులు అయితే కొట్టలేకపోయింది. పైగా ఆంధ్రాలో కూడా అనుకున్న టికెట్ హైక్స్ లభించలేదు. 5 వ షోలకి కూడా అక్కడ అనుమతి లభించలేదు.
ఇక నార్త్ లో అయితే ‘సలార్’ సినిమాకి స్క్రీన్స్ దొరక్కుండా.. చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకవేళ సోలో రిలీజ్ దక్కించుకుని ఉండుంటే.. కచ్చితంగా అది బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచేది అనడంలో సందేహం లేదు. సరే.. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) మంచి టైంలో రిలీజ్ అవుతుంది. ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంపుకి ,అదనపు షోలకు.. అనుమతులు లభించాయి. పైగా సోలో రిలీజ్ దక్కింది.
3 నెలల నుండి సరైన సినిమా లేదు. బాలీవుడ్లో కూడా ఇదే పరిస్థితి. అందుకే ‘కల్కి..’ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఓవర్సీస్ అప్పుడే 3 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. అలాంటప్పుడు మొదటిరోజు ఈ సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ఓపెనింగ్స్ ని అధిగమిస్తుందా? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. మొదటిరోజు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా రూ.224 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
అంటే ‘కల్కి 2898 ad’ రూ.225 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టాలి. ఇప్పుడు ఈ సినిమాకి ఉన్న హైప్ కి యావరేజ్ టాక్ వచ్చినా ఆ రికార్డు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది నిజమైతే.. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా మరోసారి బయటపడినట్టు అవుతుంది.