Love Story Movie: లవ్ స్టోరీకి అసలు సమస్య ఇదే?

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా మూడు రోజుల్లో ఏకంగా 22 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించిన సినిమా లవ్ స్టోరీ మాత్రమే అని చెప్పాలి. చాలారోజుల తర్వాత ఫ్యామిలీలు సైతం థియేటర్ల వైపుకు క్యూ కట్టడంతో లవ్ స్టోరీకి భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

శేఖర్ కమ్ముల రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. వీక్ డేస్ లో లవ్ స్టోరీ పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే బయ్యర్లు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే నాలుగేళ్ల క్రితం రిలీజైన ఫిదా సూపర్ హిట్ టాక్ తో ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఫిదా కలెక్షన్లను మించి లవ్ స్టోరీ కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాలి. లాంగ్ రన్ లో లవ్ స్టోరీ సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా రిజల్ట్ గురించి ఒక అంచనాకు రావచ్చు.

భారీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే మాత్రం లవ్ స్టోరీ కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉండేవని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న నాగచైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ, బంగార్రాజు సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus