Narne Nithin: నార్నె నితిన్ పని బాగుంది.. హ్యాట్రిక్ దిశగా అలా..!
- August 17, 2024 / 12:00 PM ISTByFilmy Focus
ఇప్పట్లో పెద్ద హీరోల సినిమాలే బాక్సాఫీస్ వద్ద నిలబడట్లేదు. రవితేజ (Ravi Teja) , నాగార్జున (Nagarjuna) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , రామ్ (Ram) , గోపీచంద్ (Gopichand) వంటి హీరోల సినిమాలు వచ్చి వెళ్తున్నా జనాలు పట్టించుకోవడం లేదు. వాళ్ళ మార్కెట్ కూడా అగమ్యగోచరంగా తయారయ్యింది. ఇక ఒకటి, రెండు సినిమాల అనుభవం ఉన్న హీరోల సినిమాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) మాత్రం కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘మ్యాడ్’ (MAD) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నార్నె నితిన్.
Narne Nithin

ఆ సినిమాలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో.. ఆకట్టుకున్నాడు. ఇక అతని రెండో సినిమాగా ‘ఆయ్’ (AAY) వచ్చింది. పెద్ద సినిమాలు, క్రేజ్ ఉన్న డబ్బింగ్ సినిమా..నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేస్తుంది. మొదటి రోజుతో పోలిస్తే.. రెండో రోజు బుకింగ్స్ పెరిగాయి. ఇక నటన పరంగా చూసుకుంటే…

నార్నె నితిన్ (Narne Nithin) .. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కామెడీలో కావచ్చు డాన్స్ లో కావచ్చు.. ‘మ్యాడ్’ కంటే బెటర్ గా పెర్ఫార్మ్ ఇచ్చాడు. ప్రస్తుతం అతను ‘మ్యాడ్ స్క్వేర్’ లో నటిస్తున్నాడు. ‘సితార’ ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ (Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పైగా ‘మ్యాడ్’ వంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద ఇది కూడా గట్టెక్కేసే అవకాశాలు ఉన్నాయి. సో నార్నె నితిన్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.














