రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రాధేశ్యామ్ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రాగా ప్రేక్షకుల నుంచి మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. క్లాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు బిలో యావరేజ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కగా
కనీసం 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే గతేడాది డిసెంబర్ లో విడుదలైన అఖండ, పుష్ప ది రైజ్ సినిమాలకు కూడా మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ కు నచ్చడంతో పాటు మెజారిటీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
అఖండ, పుష్ప ది రైజ్ వెండితెరతో పాటు ఓటీటీలో కూడా సంచలనాలు సృష్టించడం గమనార్హం. రాధేశ్యామ్ కూడా ఆ సినిమాలలా మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ వరకు రాధేశ్యామ్ కలెక్షన్లకు ఢోకా లేకపోయినా వీకెండ్ తర్వాత కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫలితంపై ఒక అంచనాకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన జిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేదు.
రాధేశ్యామ్ తో అయినా రాధాకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ ఆశించగా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. కథ బాగానే ఉన్నా కథనంలోని లోపాలు రాధేశ్యామ్ సినిమాకు మైనస్ అయ్యాయి. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. రాధేశ్యామ్ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.