పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. సుకుమార్ పర్ఫెక్షన్ వల్ల ఆ తేదీన ఈ సినిమా విడుదల కావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప3 స్టోరీకి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పుష్ప2 సినిమా భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను చంపడంతో ముగుస్తుందని తెలుస్తోంది.
పుష్ప3 జర్మనీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎర్రచందనం స్మగ్లర్లతో పోరాడే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప ఫ్రాంఛైజీపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని సమాచారం అందుతోంది. వరుసగా ఇండస్ట్రీ హిట్లు దక్కేలా (Sukumar) సుకుమార్ కెరీర్ ప్లానింగ్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
మరోవైపు పుష్ప2 సినిమాకు సంబంధించి అప్ డేట్స్ కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మైత్రీ నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్స్ ఇస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప2 సినిమా విడుదలైన బన్నీ ఒక ప్రాజెక్ట్ లో నటించి ఆ తర్వాత పుష్ప3 సినిమాపై ఫోకస్ పెట్టారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ వేగంగా సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒక్కో సినిమాకు బన్నీ మూడేళ్ల సమయం కేటాయించడం కరెక్ట్ కాదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. బన్నీ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది. పుష్ప2 సినిమాకు బన్నీ లాభాల్లో కూడా వాటా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. పుష్ప3 సినిమా గురించి మేకర్స్ నుంచి అధికారికంగా ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.