Trivikram: త్రివిక్రమ్ కు ఇష్టమే.. ఆ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్, అల్లు అర్జున్ లతో వేర్వేరుగా మూడు సినిమాలు తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ తో కూడా మూడో సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో అరవింద సమేత వీర రాఘవ తెరకెక్కగా ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది.

అయితే ప్రభాస్, చరణ్ లతో మాత్రం త్రివిక్రమ్ సినిమాలను తెరకెక్కించలేదు. ఈ ఇద్దరు హీరోలతో త్రివిక్రమ్ సినిమాలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత నాగవంశీ ఒక సందర్భంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రభాస్, చరణ్ లతో సినిమాలను ప్లాన్ చేస్తున్నామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్ తో త్రివిక్రమ్ కు ఈ ఇద్దరు హీరోలతో పని చేయడానికి ఆసక్తి ఉందని తేలిపోయింది. అయితే చరణ్, ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించాల్సి ఉంది.

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాలీవుడ్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు కాగా తనతో పని చేసిన స్టార్ హీరోలలో దాదాపుగా అందరు హీరోలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెమరబుల్ హిట్ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లానింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అజ్ఞాతవాసి చేదు జ్ఞాపకాలను చెరిపేసేలా ఈ సినిమా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ పారితోషికం ప్రస్తుతం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పలు సినిమాలకు కథ, కథనం, డైలాగ్స్ కోసం పని చేస్తూ ఆ విధంగా కూడా త్రివిక్రమ్ భారీ ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. రీమేక్ సినిమాలకు దర్శకత్వం చేసే ఛాన్స్ వస్తున్నా ఆ అవకాశాలను త్రివిక్రమ్ సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus