‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ రిలీజ్ అయినప్పుడు సినిమా పై పెద్దగా అంచనాలు లేవు.కాబట్టి ఆ సినిమాలో ఉన్న అన్ని హై మూమెంట్స్ కు జనాలు కనెక్ట్ అయ్యారు ఎంజాయ్ చేశారు.ఆ సినిమాలో హీరో ఎలివేషన్స్ ను నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.రవి బస్రుర్ సంగీతం, నేపధ్య సంగీతం కూడా చాలా ప్లస్ అయ్యాయి. ఈ ఒక్క సినిమాతో హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ కి సీక్వెల్ రాబోతుంది.
అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ కి థియేట్రికల్ హక్కులు, డిజిటల్- శాటిలైట్ హక్కులు భారీ రేటుకి అమ్ముడయ్యాయి. కాబట్టి టీం ప్రమోషన్స్ ను వీలైనంత ఎక్కువగా చెయ్యాలి.కానీ ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్లు ఎక్కువగా అయితే జరగడం లేదు. టీజర్, ట్రైలర్,ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఈరోజు విడుదల చేసిన రెండో పాట అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఒక ఎమోషనల్ సాంగ్ అని టీం వెల్లడించింది.
‘ఎదగరా.. ..దినకర’ అంటూ సాగే ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. అయితే ఈ పాట లిరిక్స్ కానీ ట్యూన్ గాని ప్రేక్షకుల్ని ఆకర్షించేలా లేవు.ఈ పాట హీరోకి తన మదర్ గుర్తుకొచ్చినప్పుడు వచ్చే పాట అని స్పష్టమవుతుంది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ లో కూడా ఇలాంటి ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది. ‘ధీర ధీర’ అంటూ సాగే ఈ పాట ఓ రేంజ్లో ఉంటుంది. ఈ పాట సినిమాలో వచ్చినప్పుడల్లా అందరికీ గూజ్ బంప్స్ వస్తుంటాయి.
‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ నుండీ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ అవుతుంది అనగానే అంతా ‘ధీర ధీర’ రేంజ్లోనే ఉంటుంది అని అంతా ఆశించారు కానీ పాట మాత్రం ఆ స్థాయిలో లేదు. అలా అని తీసిపారేసే పాట కూడా కాదు లెండి. ‘తందానే తానే’ అంటూ పార్ట్ 1 లో వచ్చే ట్యూన్ చివర్లో రావడం వల్ల సో సో అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి వినెయ్యండి :