బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాదమ్మ రాజు గత కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈయన కాలు భాగం మొత్తం ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో అడ్మిట్ అయినటువంటి ఈయన డిస్చార్జ్ అయ్యి బయటకు వచ్చినప్పటికీ ఇంకా స్టిక్ సహాయంతోనే నడుస్తున్నారు. ఇలా యాదమ్మ రాజు ప్రమాదానికి గురైనప్పటికీ ఈయన మాత్రం పలు సినిమా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు హీరోగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాలో యాదమ్మ రాజు నటించారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా జులై 29వ తేదీ విడుదలైంది .ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.కాలు బాగా లేకపోయినా ఈయన ప్రమోషన్ కార్యక్రమాలకు రావడమే కాకుండా పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యాదమ్మ రాజు తనకు ప్రమాదం ఎలా జరిగిందనే విషయాల గురించి వివరించారు.
తన కాలి వేలు తొలగించే సమయంలో చాలా బాధను అనుభవించానని తెలిపారు. కాలి వేలు తొలగించి అక్కడ తొడ పై భాగం నుంచి చర్మం తీసి వేసారని యాదమ్మ రాజు తెలిపారు. ఆ సమయంలో తనకు ప్రాణాలు పోయినంత పని అయిందని ఈయన తనకు జరిగినటువంటి ప్రమాదం గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.
ఇక తన కాలికి ప్రమాదం జరిగిన ఈయన మాత్రం సినిమాలపై ఉన్న ఇష్టం కారణంగా తాను ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా ప్రమోషన్లను నిర్వహించాల్సిన బాధ్యత ఆర్టిస్టుగా తనపై ఉన్నందువల్లనే తాను సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యాను అంటూ యాదమ్మ రాజు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమై జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందారు.